twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ సూపర్ స్టార్ డిసెంబర్ 2న ఇండియాకి రాక

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ సూపర్ స్టార్ ట్రామ్ క్రూయిజ్ డిసెంబర్ 2వ తారీఖున ఇండియాకి రానున్నారు. ఇంతకీ టామ్ క్రూయిజ్‌కి ఇండియాలో ఏమి పని అనుకుంటున్నారా.. టామ్ క్రూయిజ్ నటించిన 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' సినిమా ప్రమోషన్‌కి మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్న తన ఫ్యాన్స్‌ని కలసేందకు కూడా వస్తున్నారని సమాచారం.

    'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' సినిమాలో టామ్ క్రూయిజ్‌తో పాటు, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూడా నటించిన విషయం తెలిసిందే. టామ్ క్రూయిజ్ ఇండియాకి రానున్న విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా వెల్లడించడం విశేషం. ఇండియాలో ఉన్న టామ్ క్రూయిజ్ అభిమానులను స్క్రీనింగ్ నిమిత్తం కలిసేందుకు టామ్ క్రూయిజ్ వస్తున్నారని వెల్లడించారు.

    ప్రపంచ వ్యాప్తంగా టామ్ క్రూయిజ్ నటించిన 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' సినిమా డిసెంబర్‌లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు రెండు వారాల ముందు సుమారు 1500 మంది హీరో టామ్ క్రూయిజ్‌తో కలసి సినిమాని వీక్షించనున్నారు. ఇందుకు అభిమానులు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటంటే హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్‌కి చెందిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలతో పాటు, 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్'లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

    ఎవరైతే సమాధానాలు చెప్తారో, వారు డైరెక్టుగా ముంబైలో టామ్ క్రూయిజ్‌తో కలసి సినిమాని వీక్షించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇండియాలో ఉన్న అన్ని పట్టణాల్లో నిర్వహించనున్నారు. ఇండియాలో 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' సినిమా ప్రమోషన్‌ హాక్కులను 'వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్' వారు సొంతం చేసుకొవడం జరిగింది. 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న విడుదలవుతుంది.

    English summary
    Hollywood superstar Tom Cruise is coming to India on Dec 2 and he will not only promote his forthcoming film “Mission Impossible 4 Ghost Protocol”, but will also host a screening for his Indian fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X