Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాలీవుడ్ సూపర్ స్టార్ డిసెంబర్ 2న ఇండియాకి రాక
హాలీవుడ్ సూపర్ స్టార్ ట్రామ్ క్రూయిజ్ డిసెంబర్ 2వ తారీఖున ఇండియాకి రానున్నారు. ఇంతకీ టామ్ క్రూయిజ్‌కి ఇండియాలో ఏమి పని అనుకుంటున్నారా.. టామ్ క్రూయిజ్ నటించిన 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' సినిమా ప్రమోషన్‌కి మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్న తన ఫ్యాన్స్‌ని కలసేందకు కూడా వస్తున్నారని సమాచారం.
'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' సినిమాలో టామ్ క్రూయిజ్‌తో పాటు, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూడా నటించిన విషయం తెలిసిందే. టామ్ క్రూయిజ్ ఇండియాకి రానున్న విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా వెల్లడించడం విశేషం. ఇండియాలో ఉన్న టామ్ క్రూయిజ్ అభిమానులను స్క్రీనింగ్ నిమిత్తం కలిసేందుకు టామ్ క్రూయిజ్ వస్తున్నారని వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా టామ్ క్రూయిజ్ నటించిన 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' సినిమా డిసెంబర్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు రెండు వారాల ముందు సుమారు 1500 మంది హీరో టామ్ క్రూయిజ్‌తో కలసి సినిమాని వీక్షించనున్నారు. ఇందుకు అభిమానులు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటంటే హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్‌కి చెందిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలతో పాటు, 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్'లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
ఎవరైతే సమాధానాలు చెప్తారో, వారు డైరెక్టుగా ముంబైలో టామ్ క్రూయిజ్‌తో కలసి సినిమాని వీక్షించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇండియాలో ఉన్న అన్ని పట్టణాల్లో నిర్వహించనున్నారు. ఇండియాలో 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' సినిమా ప్రమోషన్ హాక్కులను 'వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్' వారు సొంతం చేసుకొవడం జరిగింది. 'మిషన్ ఇంపాజబుల్ 4 గోస్ట్ ప్రొటోకాల్' ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న విడుదలవుతుంది.