Don't Miss!
- News
పిడికిలి బిగించి లోకేష్ తొలి అడుగు - బాలయ్య భారీ ర్యాలీ : సొమ్మసిల్లిన తారకరత్న.!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్ను కనిపెట్టడం ఎలాగంటే..
- Finance
Adani Shares: అదానీపై రిపోర్టు విశ్వసనీయమైనదే.. నోరు విప్పిన బిలియనీర్ ఇన్వెస్టర్
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- Technology
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Tom Cruise: విమానంలో నుంచి దూకి ఫ్యాన్స్ కు స్పెషల్ థాంక్స్ చెప్పిన హాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా తనదైన అద్భుత విన్యాసాలతో రియల్ హీరోగా మంచి గుర్తింపును అందుకున్న స్టార్ టామ్ క్రూజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతను సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా అందులో ఏదో ఒక అద్భుతమైన కంటెంట్ ఉంటుంది అనే చెప్పాలి. తన సాహసాలతో నిత్యం అభిమానులకు షాక్ ఇచ్చే ఈ దిగ్గజ హీరో ఈసారి మరొక కళ్లు చెదిరే వీడియోను పోస్ట్ చేశాడు.
ఏకంగా ఆకాశంలో వెళుతున్న విమానం నుంచి ఒక్కసారిగా దూకేసాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన టామ్ క్రూజ్ ఫ్యాన్స్ కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఏడాదికి మీకు కృతజ్ఞతలు తెలుపకుండా ముగింపు పలికేది లేదు అంటూ తదుపరి సినిమా కోసం కూడా సిద్ధమవుతున్నాను అని ఈ సాహసోపేతమైన వీడియో ద్వారా టామ్ తెలియజేశాడు.

అతను చివరిగా నటించిన టాప్ గన్ మేవరిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు నష్టాల్లో కూడా సాగుతున్న హాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ఆ సినిమాకు అంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ హీరో ఇదివరకే చాలాసార్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా ఇప్పుడు మరొక సాహసోపేతమైన వీడియోను షేర్ చేస్తూ తన తదుపరి సినిమా సెట్స్ లోకి వెళ్తున్నట్లుగా తెలియజేశాడు.
A special message from the set of #MissionImpossible @MissionFilm pic.twitter.com/sfnWWluLyl
— Tom Cruise (@TomCruise) December 18, 2022
ఒకటిన్నర నిమిషాల్లో ఉన్న ఈ వీడియోలో తన అనుభవాన్ని తెలియజేశాడు. మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ భాగాలను పూర్తి చేయడానికి మేము సిద్ధమయ్యాము అంటూ... ఇంతకుముందు వచ్చిన సినిమాలను సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నానని అన్నాడు. అలాగే ఈ సెలవుల్లో మీరు చాలా సంతోషంగా సురక్షితంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని అతను ప్యారశూట్ తో ప్లేన్ నుంచి దూకేశాడు. ఇక ఆ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ విధంగా వైరల్ అవుతుంది. ఇక 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్' 2023 జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.