వారి వివాహబంధానికి చివరి రోజులు
హాలీవుడ్ జంట ట్రామ్ క్రూజ్, క్యాటీ హాల్మస్ ల వివాహ ఒప్పందం ఈ నెలలో జరిగే వారి మూడవ వివాహ వార్షికోత్సవంతో ముగియనుంది. దీంతో వారు తిరిగి తమ ఒప్పందాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. దీనికి క్యాటీ హాల్మస్ భారీగా నగదును డిమాండ్ చేస్తోందని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక ఓ వార్తను ప్రచురించింది. సదురు పత్రిక కథనం ప్రకారం ఈ 30 ఏళ్ల నటి లాయర్ అయిన తన తండ్రిని ఈ ఒప్పందం గురించి సలహాలను అడుగుతోందట. మరో సారి ఒప్పందం కుదుర్చుకోవడానికి అధనంగా 500.000 డాలర్లను డిమాండ్ చేస్తోందట. టామ్ కొత్తగా తీసుకున్న మతాన్ని సమ్మతించడానికి ఈ అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తోందట.
అంతే కాకుండా ఒప్పందాన్ని కొనసాగించాలంటే తన కోర్కెలకు సమ్మతించాలని ఓ పెద్ద లిస్టే ఇచ్చేసిందట. వాటి వివరాలు ఇలా వున్నాయి...
1. ఆమె బట్టలకై సంవత్సరానికి చెల్లించే 750,000 డాలర్లను 2 మిలియన్ డాలర్లకు పెంచాలట.
2. టామ్ క్రూజ్ అనగానే మనకు గుర్తుకు వచ్చే సినిమా మిషన్ ఇంపాజిబుల్ సినిమా తర్వాతి సీక్వెల్ తనకో పాత్ర ఇవ్వాలట.
3. టామ్ కూతురు సూరికి జన్మనిచ్చినందుకు 3 మిలియన్ డాలర్ల బోనస్ అందుకున్న క్యాటీ, తిరిగి గర్భం దాల్చడానికి అధనంగా 11 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తోంది. కానీ క్రూజ్ 5.5 మిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా వున్నాడట.
ఒక వేళ టామ్ ఆమె కోర్కెలకు సమ్మతించకపోతే వారి వివాహ ఒప్పందం రద్దుకానుందనే వార్తలు హాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











