టామ్ క్రూయిజ్‌కు కరోనా వైరస్ ఎఫెక్ట్.. మిషన్ ఇంపాసిబుల్ 7పై దెబ్బ
హాలీవుడ్‌లో సెన్సేషనల్ సిరీస్ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఉంది. ప్రస్తుతం ఏడో సిరీస్ మిషన్ ఇంపాసిబుల్ రెడీ అవుతున్నది. తాజాగా ఈ సినిమా మూడు వారాల షెడ్యూల్‌ను ఇటలీలో ప్లాన్ చేశారు. టామ్ క్రూయిజ్ తదితరులతో కూడిన యూనిట్ షూటింగ్ ఏర్పాట్లో తలమునలకై ఉండగా. కరోనావైరస్ అడ్డు తగిలింది. దాంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది.
ఇటలీలోని వెనిస్‌లో మిషన్ ఇంపాసిబుల్ మూవీ షూట్ ప్రారంభించాం. కరోనా వైరస్ విజృభిస్తుండటంతో షూట్‌ను ఆపివేశాం అని పారామౌంట్ పిక్చర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా లాగూన్ సిటీలోని వార్షిక కార్నివాల్ ఫెస్టివల్ నిలిచిపోయిది. ఇటలీలో ఇప్పటీకే కరోనా వైరస్ కారణంగా 220 మంది చనిపోయారు. ఈ వ్యాధి విస్తృతంగా పాకుతున్నది. అందుకే షూటింగ్‌ను క్యాన్సిల్ చేశాం అని చెప్పారు.

మిషన్ ఇంపాసిబుల్ 7 షూట్‌ను మరో చోట చేయాలా? లేక కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేదాకా వేచి చూడాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని యూనిట్ తెలిపింది. ప్రస్తుతం యూనిట్ సభ్యులంతా తమ నివాసాలకు చేరుకొన్నారు. ఇటలీలోని పరిస్థితిని వేచి చూస్తున్నాం అని పారమౌంట్ స్టూడియో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











