twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్యతో ఏకాంతంగా 50వ పుట్టినరోజు వేడుకలు

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్, జూన్ 15: హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ తన యాభైవ పుట్టిన రోజు వేడుకలను తన భార్య కేటీ హోమ్స్ తో కలిసి ఐస్ ల్యాండ్‌లో జరుపుకునేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. 49 సంవత్సరాల వయసు కలిగిన టామ్ క్రూయిజ్ జులై 3వ తారీఖు నాటికి 50 వసంతాలను పూర్తి చేసుకోనున్నాడు. ప్రస్తుతం టామ్ క్రూయిజ్ 'ఓబ్లివియన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ... తన జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మక 50వ పుట్టిన రోజుని జరుపుకునేందుకు కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించడానికి సిద్దమైనట్లు సమాచారం.

    ఈ సందర్బంగా మీడియాతో టామ్ క్రూయిజ్ మాట్లాడుతూ మనం పెరుగుతున్న కొద్ది ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలను దర్శించాలనేది ఓ అందమైన కలగా భావిస్తాం. నా పుట్టిన రోజున నేను షూటింగ్‌ పాల్గోన్నప్పటికీ... నా కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని మాత్రం కేటాయిస్తానని అన్నాడు. నేను షెడ్యూల్స్ బిజీగా ఉన్నా.. మేమిద్దరం ఎప్పుడూ కలసే ఉంటామని తన భార్య గురించి చెప్పాడు. జులై 3వ తారీఖున నా పుట్టిన రోజు, మేమ అనుకున్న దాని ప్రకారం ఐస్ ల్యాండ్‌లో ఉంటాం. నాకు హైకింగ్ అంటే చాలా ఇష్టం అని అన్నారు.

    టామ్ క్రూయిజ్ భార్య కేటీ హోమ్స్ కూడా హాలీవుడ్‌లో పేరు మోసిన హీరోయిన్ కావడంతో షూటింగ్స్‌లో బిజిగా ఉన్నా.. జులై 3వ తారీఖు నాటికి ఇద్దరూ వారికున్న షెడ్యూల్స్ స్వల్ప మార్పులు చేసుకోని సమయాన్ని ఐస్ ల్యాండ్‌లో గడపనున్నారు. ఈ విషయంపై టామ్ కేట్ గనుక తన సినిమాను పూర్తి చేస్తే గనుక మేము ఇద్దరం కలిసి కాంపింగ్ వెళ్లిపోతామని అన్నాడు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actor Tom Cruise plans to spend his 50th birthday hiking around Iceland with his wife Katie Holmes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X