టాప్ సెలబ్రిటీ చైల్డ్ ఎవరు..?
ప్రపంచంలో ఉన్న ప్రముఖ సెలబ్రిటీల ఛైల్డ్‌లలో ఎవరు టాప్ సెలబ్రిటీ చైల్డ్‌గా ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను ఓ వెబ్ సైట్ నిర్వహించిన పోల్‌లో మొట్టమొదటి స్దానాన్ని హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ కూతరు సూరి క్రూయిజ్ కైవసం చేసుకున్నారు. ఇక రెండవ స్దానంలో పుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెకహాం, విక్టోరియా బెకహాంల ముద్దుల గారాల పట్టి హార్పర్ బెకహాం కైవసం చేసుకుంది. మూడవ స్దానాన్ని ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్‌ల మద్దుల కూతురు షైలో కైవసం చేసుకోగా, నాల్గవ స్దానాన్ని జెన్నిఫర్ లోపెజ్ కుమారుడు మ్యాక్స్ ఆంటోనీ కైవసం చేసుకున్నాడు.
టాప్ టెన్ స్దానాలలో బ్రిట్నీ స్పియర్స్ ముద్దుల కొడుకు జేడెన్ ఫెడర్లిన్ కూడా స్దానం దక్కించుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే జెన్నిపర్ లోపెజ్, మార్క్ ఆంటోనీ ముద్దుల కుమారుడు మ్యాక్స్ ఆంటోనీ నాల్గవ స్దానాన్ని కైవసం చేసుకోగా, మ్యాక్స్ ఆంటోనీ చెల్లి ఎమ్మా అంటోనీ పదహేడవ స్దానాన్ని కైవసం చేసుకుంది. జోలీ ముద్దుల కూతురు షైలో మూడవ స్దానాన్ని కైవసం చేసుకోగా, ఆమె సిస్టర్స్ వివిన్నీ, జహారా ఎనిమిది, పదకొండు స్దానాలను సొంతం చేసుకున్నారు. మొదటి పది స్దానాలను కైవసం చేసుకున్న సెలబ్రిటీల ఛైల్డ్స్ వరుసగా..
* సూరి క్రూయిజ్
* హార్పర్ సెవన్ బెకహాం
* షైలో
* మ్యాక్స్ ఆంటోనీ
* మాసన్ డిసిక్
* హానర్ మారీ వార్రెన్
* క్రూజ్ డేవిడ్ బెకహాం
* వివిన్నీ
* వైలెట్ అన్నే అఫ్లిక్
* జేడెన్ ఫెడర్లిన్


Click it and Unblock the Notifications











