మిషన్ ఇంపాజిబుల్ షూటింగులో గందరగోళం.. టామ్ క్రూజ్ బండబూతులు.. దూషణలతో..
మిషన్ ఇంపాజిబుల్ మూవీ యూనిట్‌లో గందరగోళం నెలకొన్నది. హీరో ట్రామ్ క్రూజ్ తీరు నచ్చకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ యూనిట్‌ను తప్పుకోవడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. కోవిడ్ నిబంధనల మధ్య టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ షూటింగును ప్రారంభించారు. అయితే షూటింగు సమయంలో కోవిడ్ మార్గ దర్శకాలను అమలు చేసేలా కఠిన చర్యలు తీసుకొన్నారు. ఈ క్రమంలో టామ్ పీకిన క్లాస్‌తో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

యూకేలో మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్
ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్ యూకేలోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో జరుగుతున్నది. కోవిడ్ 19 నిబంధనలు పాటించని వారిపై టామ్ క్రూజ్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు. పలు మార్లు హెచ్చరించినా వారు పట్టించుకోకపోవడంతో గట్టిగా కేకలు వేయడం, దాంతో కొందరు టీమ్ మెంబర్స్ మనస్తాపం చెందారు. తాజాగా కోవిడ్ నిబంధనలు పాటించని సభ్యులపై కోపగించుకోవడంతో ఐదుగురు సభ్యులు యూనిట్‌కు గుడ్‌బై చెప్పినట్టు తెలిసింది.

షూటింగులో ఉన్నత ప్రమాణాల కారణంగా
మిషన్ ఇంపాజిబుల్ సెట్లో పాటిస్తున్న నిబంధనలు అందరికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మన సినిమా షూటింగులో పాటిస్తున్న ప్రమాణాలతో స్పూర్తి పొందిన ఇతర నిర్మాతలు హాలీవుడ్‌లో సినిమాలు నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. ప్రతీ రోజు స్టూడియోలో ప్రతీ ఫకింగ్ గయ్‌తో మాట్లాడుతున్నాను. ఈ క్రమంలో నేను నిర్మాతలు, పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాను. మనం పాటించే చర్యలను గొప్పగా ప్రశంసిస్తున్నారు అని టామ్ క్రూజ్ స్పష్టం చేశారు.

మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్‌తో
కరోనా సమయంలో షూటింగ్ ఎలా చేయాలనే విషయంపై మనం దారిచూపడం వల్ల వేలాది ఉద్యోగాలు ఇండస్ట్రీలో క్రియేట్ అవుతున్నాయి. కానీ మీలాంటి మదర్ ఫకర్స్ పట్టించుకోవడం లేదు. మీ వల్ల ఈ సినిమా ఆగిపోయే పరిస్థితులు రావడం నాకు ఇష్టం లేదు. ఇలానే పద్దతి ఉంటే.. యూనిట్ నుంచి తొలగిస్తాం అని గట్టిగా యూనిట్ సభ్యులను హెచ్చరించారు. దాంతో ఉద్యోగ భద్రత కరువైందనే కారణంతో ఐదుగురు సభ్యులు యూనిట్ నుంచి తప్పుకొన్నారు.

టామ్ క్రూజ్ వీడియో వైరల్
మిషన్ ఇంపాజిబుల్ యూనిట్ సభ్యులను బండబూతులు, దూషణకు పాల్పడిన టామ్ క్రూజ్ వీడియోను సన్ పత్రిక షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టామ్ క్రూజ్ అంకితభావాన్ని ఆయన ఫ్యాన్స్ విశేషంగా ప్రశంసిస్తున్నారు. కోవిడ్ 19 సమయంలో కూడా ధైర్యంతో షూటింగ్ మొదలుపెట్టి దానిని కొనసాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచిన తమ హీరోను ఆకాశానికి ఎత్తుతున్నారు.


Click it and Unblock the Notifications











