క్యాటీ హాల్మస్ తో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధంగాలేనన్నహాలీవుడ్ అందగాడు..!
వాషంగ్టన్: టామ్ క్రూజ్ హాలీవుడ్ హీరోలు అందరిలోకెల్లా అందగాడు. అలాగే తన భార్యను ప్రేమించడంలో కూడా అందగాడే. వీరిద్దరూ ప్రేమించి ఐయిదు సంవత్సలాల క్రితం పెళ్శి చేసుకున్నారు. ఆ ప్రేమ అప్పటి నుండి ఇప్పటివరకు అలాగే కోనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో టామ్ క్రూజ్ తన భార్యతో కొత్త రోమాన్స్ మొదలుపెట్టాడు. ఆ కొత్త రోమాన్స్ ఏంటంటే తన భార్య ఎక్కడికి వెళ్శిన ఎర్రగులాబీలతో తనకి స్వాగతం పలుకుతున్నాడంట. ప్రస్తుతం ఈ అమ్మడు వాషంగ్టన్ లో ది రోమాన్టిక్స్ అనే సినిమా షూటింగ్ లో ఉంది. తనతోనే కాకుండా మా నాలుగు సంవత్సరాల పాప సూరి తో కూడా క్రూజ్ చాలా అప్యాయతగా తన ప్రేమను పంచుతారు. నాకు ఒక తల్లిగా ఇదంతా చాలా ఆనందాన్ని ఇస్తుంది, మా పాప అప్పుడే పాటలు మరియు డాన్స్ లు కూడా చేస్తుంటే నాకు చాలా ముద్దుగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా 'మిషన్ ఇంపాజబుల్' హీరో టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో రూపొందబోయే తర్వాతి మిషన్ ఇంపాజబుల్ సీక్వెన్స్ లో ఆయన భార్య, హాలీవుడ్ సెక్సీ నాయిక క్యాటీ హాల్మస్ ప్రతినాయికగా నటించనుందని విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారం ప్రకారం టామ్ క్రూజ్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టిన 'మిషన్ ఇంపాజబుల్' సినిమా తాజా సీక్వెల్ లో టామ్ తన సహచరిణి క్యాటీతో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధంగా లేడట. దీంతో ఆమెను ప్రతినాయికగా నటింపజేయనున్నట్టు తెలిసింది. ఇంతకు మునుపు వీరు నాయికా-నాయకులుగా నటించిన విషయం తెలిసిందే. దీంతో నాయక-ప్రతినాయికలుగా వీరిద్దరూ ఎలా వుండబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications











