Tom Cruise: హిందీతో షాకిచ్చిన హాలీవుడ్ స్టార్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే
హాలీవుడ్‌లో వచ్చే అడ్వెంచరస్ మూవీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో నటించే హీరోలకు సైతం వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అలాంటి వారిలో టామ్ క్రూజ్ ఒకరు.
సుదీర్ఘ కాలంగా తనదైన సాహసోపేత చిత్రాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న ఆయన.. ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ హాలీవుడ్ స్టార్ హీరో 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' అనే ఫుల్ లెంగ్త్ అడ్వెంచరస్ మూవీని చేశాడు.

టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన చిత్రమే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి పేరున్న నటీనటులు చేసిన ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది భాషల్లో రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో హీరో టామ్ క్రూజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ హాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హిందీలో మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు.
టామ్ క్రూజ్‌తో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ మాట్లాడుతూ.. 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1 మూవీలో మీరు ఫ్రెంచ్ బాగానే మేనేజ్ చేశారు. అయినా మీరు చేయలేనిది ఏదైనా ఉందా? అన్నట్లు ఇప్పుడు మీరు నాతో హిందీలో మాట్లాడబోతున్నారా' అని అడిగింది.
దీనికాయన నవ్వుతూ 'నేను మాట్లాడాలని మీరు కోరుకుంటే కచ్చితంగా సిద్ధంగా ఉన్నాను' అని అన్నాడు. దీంతో ఆమె 'నమస్తే.. ఆప్ కైసే హై (నమస్కారం.. మీరు ఎలా ఉన్నారు)' అని చెప్పమంది. దీనికి టామ్ అచ్చం హిందీ వాళ్లు మాట్లాడినట్లే దీన్ని పలికి షాకిచ్చాడు.
టామ్ క్రూజ్ మాట్లాడిన హిందీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఇండియన్స్ అందరూ అతడికి ఫిదా అయిపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీ కోసం టామ్ క్రూజ్ ఎన్నో సాహసాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











