'వన్‌షాట్' సినిమా చేయడానికి సంతకం పెట్టిన సూపర్ స్టార్
హాలీవుడ్ సూపర్ హీరో టామ్ క్రూయిజ్ క్రిస్టోఫర్ మెక్‌క్వరీ ధ్రిల్లర్ సినిమా 'వన్ షాట్'లో లీడ్ రోల్ పోషించడానికి సంతకం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని క్రిస్టోఫర్ మెక్‌క్వరీ తన బ్లాగులో తెలియజేశారు. క్రిస్టోఫర్ మెక్‌క్వరీ తన బ్లాగులో రాసిన దాని ప్రకారం టామ్ క్రూయిజ్ వన్ షాట్ సినిమాలో జాక్ రీచర్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారని అన్నారు. ఇక ఈ సినిమా లీ చిల్డ్ రాసినటువంటి 15 నవలలో ఒకటైన నవలను ఆధారం చేసుకోని రూపోందించడం జరుగుతుంది.
లీ చిల్డ్ రాసినటువంటి 15 నవలలో 9వ నవల ఆధారంగా సినిమా తీస్తున్నారు. ఈ నవలలో జాక్ రీచర్ అనే క్యారెక్టర్ దారి తప్పిన ఓ మాజీ మిలిటరీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అలా దారి తప్పిన ఓ మిలిటరీ ఆఫీసర్ మర్డర్ కేసులో ఇరుక్కోవడం, ఆ తర్వాత ఆ మర్డర్ కేసు నుండి ఎలా బయట పడ్డాడు అనే సారాంశం మీద సినిమా తీస్తున్నారు. ఈ నవల సిరిస్ రాసినటువంటి లీ చిల్డ్ కూడా తన పూర్తి సహాకారాన్ని టామ్ క్రూయిజ్‌కి సినిమా తీయడానికి అందిస్తానని పేర్కోన్నారు.
టామ్ క్రూయిజ్, క్రిస్టోఫర్ మెక్‌క్వరీ ఇద్దరూ కలసి 2008వ సంవత్సరంలో తీసినటువంటి వరల్డ్ వార్ 2 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'వన్ షాట్' పై టామ్ క్రూయిజ్ అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలను పెట్టుకున్నారు. సాధ్యమైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి 2012లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్‌క్వరీ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











