వార్నర్ బ్రదర్స్ ప్రతిష్టాత్మక చిత్రంలో అతనే హీరో..

By Nageswara Rao

వార్నర్ బ్రదర్స్ ఎంతో ప్రతిష్టాత్మక నిర్మించదలచిన సైంటిఫిక్ ధ్రిల్లర్ వార్ ప్రాజెక్టు “We Mortals Are" సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ ప్రధాన పాత్రని పోషించనున్నట్లు సమాచారం. ఈ సందర్బంలో వార్నర్ బ్రదర్స్ నిర్మాతలు మాట్లాడుతూ వార్నర్ బ్రదర్స్ స్డూడియో మరోసారి టామ్ క్రూయిజ్‌తో సినిమాని చేయాలని తలపిస్తున్నట్లు ఓ ప్రముఖ హాలీవుడ్ రిపోర్టర్‌కి తెలియజేయడం జరిగింది.

“We Mortals Are" సినిమాలో టామ్ క్రూయిజ్ యంగ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఈ సినిమాని వార్నర్ బ్రదర్స్ జపాన్‌కు చెందిన ఆర్మీ ఆఫీసర్ హిరోషి సకురాజకా జీవిత కధ ఆధారంగా తీయడం జరుగుతుంది. ఈ సినిమాని టామ్ క్రూయిజ్ అభిమానుల కొసం ప్రత్యేకంగా 2013లో విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.

ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రని హాలీవుడ్ రొమాంటిక్ హీరో బ్రాడ్ పిట్‌ని చేయమని అడడగా, అతను తిరస్కరించడం జరిగింది. ఐతే చివరకు టామ్ క్రూయిజ్‌కు హీరోగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని వార్నర్ బ్రదర్స్ ప్రతినిధి తెలిపారు. ఇది ఇలా ఉంటే టామ్ క్రూజ్ తన మిషన్ ఇంపాజబుల్-4 చిత్రం త్వరలో విడుదలవబోతుంది. ఈసినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కొసం టామ్ క్రూయిజ్ ఇటీవలే ప్రపంచంలోని ఎత్తైన బుర్జ్ ఖాలిఫా మీద నుండి ఒళ్లు గగుర్పోడిచే విన్యాసాలు చేయడం జరిగింది.

ఈ సందర్బంలో టామ్ క్రూయిజ్ మాట్ల్జాడుతూ అభిమానుల కోసం ఎంతటి సాహాసాన్ని చేయడానికి తాను ఎప్పుడూ సిద్దమేనని అన్నారు. 2,717 అడుగుల ఎత్తైన భవనం నుండి చేయనున్న స్టంట్స్ చేయడం జరిగింది. టామ్ క్రూజ్ కిటికీలలో నుంచి పరిగెత్తుకుంటూ 124అంతస్తునుండి కిందకు దూకడంతో స్టంట్ మొదలవుతుందని, దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం జరిగిందన్నారు.

ఈవిషయంపై టామ్ క్రూజ్ మాట్లాడుతూ నాజీవతంలో నాఎదుగుదలకు నాఅభిమానులు నాకు ఎంతగానో సహాకరించారు. అలాంటి అభిమానులను ఆనందపరచడం కోసం నేను ఏమిచేయడానికైన సిద్దమేనని అన్నారు. గతంలో వచ్చినటువంటి సిరిస్ లమాదిరే ఇదికూడా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కోట్టే విధంగా ఉంటుందని అన్నారు. ఇక ఈసినిమా విషయానికి వస్తే నేను ఇందులో ఏజెంట్ పాత్రలో కనిపిస్తానన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X