ఓటీటీలోకి 4721 కోట్ల సినిమా.. ఏకంగా 7 నెలల తర్వాత.. ఎందులో చూడాలంటే!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల కంటే హాలీవుడ్‌లోనే ఎక్కువగా అడ్వెంచరస్ మూవీలు వస్తుంటాయి. అందులో కొన్ని ఫ్రాంచైజీలుగా వచ్చి సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తున్నాయి. అలాంటి వాటిలో 'మిషన్ ఇంపాజిబుల్' ఒకటి. హాలీవుడ్ అడ్వెంచరస్ స్టార్ టామ్ క్రూజ్ హీరో చేసిన ఈ సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్లు అయిన విషయం తెలిసిందే.
'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీ నుంచి ఏడో పార్ట్‌ను గత ఏడాది జూన్‌లో 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' పేరిట విడుదల చేశారు. టామ్ క్రూజ్ నటించిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో వచ్చింది. ఇండియాలో కూడా ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా వచ్చిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీని 291 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను అంటే.. భారత కరెన్సీలో ఈ మూవీకి రూ. 2389 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇది ఫుల్ రన్‌లో రూ. 4721 కోట్లు వసూలు చేసింది. తద్వారా నిర్మాతల జేబుల్లో కోట్ల రూపాయల లాభాలను నింపేసింది.
వేల కోట్లు వసూలు చేసి భారీ హిట్‌గా నిలిచిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో ప్రచారాలు జరిగినా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో అసలు ఇది ఓటీటీలోకి వస్తుందా? రాదా? అని చాలా మంది సందేహించారు. ఈ పరిస్థితుల్లోనే టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది.
'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ జనవరి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతుంది. దీన్ని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ తాజాగా ప్రకటించింది. అంటే ఈ చిత్రం ఏకంగా ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీని క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి హాలీవుడ్ ఫేమస్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. టామ్, క్రిస్టోఫర్ కలిసి దీన్ని భారీ బడ్జెట్‌తో తీశారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











