Mission Impossible Twitter Review: ఇది అసలు మూవీయేనా? ఈ వయసులో అలాంటి సీన్లా? మిషన్ సక్సెస్ అయిందా!
టామ్ క్రూజ్.. ఈ పేరుకు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరమే లేదు. అంతలా ఈ హాలీవుడ్ యాక్షన్ హీరో సుదీర్ఘ కాలంగా తనదైన అడ్వెంచరస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే సమయంలో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడంతో పాటు రికార్డులను షేక్ చేసేస్తున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు టామ్ క్రూజ్ 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఆకట్టుకుందా? ఇది భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందా? అనే విషయాలు చూద్దాం పదండి!
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్:టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన చిత్రమే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి పేరున్న నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. టామ్, క్రిస్టోఫర్ దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇది జూలై 12న రిలీజ్ అయింది.

టామ్ సాహసాలు.. అంచనాలతో:టామ్ క్రూజ్ చిత్రాలు అంటేనే ఎంతో సాహసోపేత సన్నివేశాలతో సాగుతుంటాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీ కోసం అతడు ఎన్నో రిస్కీ షాట్స్ చేశాడు. ముఖ్యంగా బైక్‌తో చేసిన విన్యాసాలు అంతా ఇంతా కాదు. అందుకే ఈ చిత్రం ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అంచనాలను భారీగా ఏర్పరచుకుంది.
సీటు చివర్లో కూర్చోబెట్టే యాక్షన్:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అందులో 'ఆ నిరీక్షణ సరైందే అని నిరూపించిన చిత్రం మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1. అద్భుతమైన కథ, నమ్మశక్యం కాని తారాగణం, సీటు అంచున కూర్చోబెట్టే యాక్షన్, ముఖ్యమైన మిషన్ టామ్ క్రూజ్.. మొత్తంగా అద్భుతం' అని చెప్పుకొచ్చాడు.
టామ్ క్రూజ్ కాపాడాడు అంటూ:టామ్ క్రూజ్ 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు. 'గతంలో మాదిరిగా టామ్ క్రూజ్ ఈ సమ్మర్‌ను తన చిత్రంతో కాపాడాడు. 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' సినిమా థ్రిల్లింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా సాగే బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు' అంటూ అందులో వివరించారు.
తప్పక చూడవలసిన సినిమా:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో 'ఈ సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఏమాత్రం తప్పులు లేకుండా.. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కించారు. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే అత్యుత్తమ తారాగణం, అద్భుతమైన విజువల్స్ మరియు అద్భుతమైన సౌండ్ డిజైన్‌తో సాగింది' అంటూ వెల్లడించారు.
పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాం:హై రేంజ్ యాక్షన్‌తో వచ్చిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీని తిలకించిన ఓ నెటిజన్ ''మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' బ్లాస్టింగ్‌లా ఉంది. యాక్షన్ పార్ట్ అదిరింది. సినిమాను ఎంతో వేగంగా నడిపిస్తూ కథను అర్థవంతంగా చూపించారు. క్యారెక్టర్ వర్క్ అంతా బాగుంది. రెండో పార్ట్ కోసం వేచి చూస్తున్నాము' అంటూ చెప్పుకొచ్చారు.
ఈ వయసులో అలాంటి యాక్షన్:టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీ చూసిన ఓ నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు. ''మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మిషన్ టార్గెట్ దిశగానే వెళ్లింది. టామ్ క్రూజ్ ఈ వయసులో తన యాక్షన్, లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. మీ దగ్గరలోని థియేటర్లలో ఉంటే తప్పుకుండా చూడండి. పార్ట్ 2 కోసం వెయిటింగ్' అని అందులో చెప్పాడు.


Click it and Unblock the Notifications











