twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిషన్: ఇంపాజిబుల్ 7 షూటింగ్‌లో టామ్ క్రూయిజ్.. కళ్లు చెదిరే ఫోటోతో..

    |

    లాక్‌డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే బయడపడుతున్న సినీ ప్రముఖులంతా షూటింగులకు మెల్లమెల్లగా హాజరవుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమా పరిశ్రమ షూటింగులన్నీ ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ తన సినిమాపై ఫోకస్ పెట్టారు.

    ట్రామ్ క్రూయిజ్ తన తదుపరి ప్రాజెక్టు మిషన్: ఇంపాజిబుల్ 7 మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని నార్వేలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిస్టఫర్ మెక్‌క్వారీ తన సోషల్ మీడియా ద్వారా సినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు.

     Tom Cruise starts Mission: Impossible 7 shoot in Norway after lockdown

    నా తదుపరి చిత్రం మిషన్: ఇంపాజిబుల్ 7 సినిమా మొదటి రోజు షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఇది. లాక్‌డౌన్ మొదలైన తర్వాత తొలిసారి షూటింగ్ చేస్తున్నాం. ఈథాన్ హంట్ అనే పాత్రలో మరోసారి టామ్ పరకాయ ప్రవేశం చేయబోతున్నారు అంటూ తెలిపారు. నార్వేలోని అందమైన పర్వతాల్లోని బ్రిడ్జి మీద టామ్ ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకొన్నారు. యాక్షన్.. డే 1 అంటూ కాప్షన్ పెట్టారు.

     Tom Cruise starts Mission: Impossible 7 shoot in Norway after lockdown

    ఇక మిషన్ ఇంపాజిబుల్ 7 విషయానికి వస్తే.. ఈ చిత్ంలో రెబెకా ఫెర్గ్యూసన్ , వింగ్ రేమెస్, సైమన్ పెగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021లో నవంబర్ 19న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, లండన్‌లో క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన టెనెట్ చిత్రం ప్రీమియ్‌కు టామ్ క్రూయిజ్ హాజరయ్యారు. స్వయంగా టామ్ కారు నడుపుకొంటూ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    English summary
    Hollywood actor Tom Cruise starts Mission: Impossible 7 shoot in Norway after lockdown. Director Christopher McQuarrie shared film 'Mission: Impossible 7 photo from the sets with a caption which read as "Action... #MI7 Day 1"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X