'సూపర్ స్టార్' నోట వెంట ఆ స్టార్ ప్లేయర్ పేరు..
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ ఇటీవల ఓ ప్రముఖ ఇంటర్యూలో మాట్లాడుతూ పుట్‌బాల్ సాకర్ హీరో 'డేవిడ్ బెకహాం'తో సినిమా రూపొందించాలనే కోరికను బయట పెట్టాడు. ఈ సందర్బంలో టామ్ క్రూయిజ్ మాట్లాడుతూ నేను బెకహాంతో కలసి యాక్షన్ సినిమాలను చేయడానికి చాలా ఇష్టపడతానని అన్నాడు. అతను చాలా గోప్పవాడు. అతని కొట్టే కిక్‌లో దమ్ము ఉంటుందన్నాడు.
డేవిడ్ బెకహాం నాకు పుట్ బాల్ ఎలా అడాలో చెప్పిన మొదటి వ్యక్తి అని ప్రశంసలు కురిపించాడు. ఇది ఇలా ఉంటే డేవిడ్ బెకహాం గతంలో హాలీవుడ్‌తో చాలా సార్లు సంబంధాలు కోనసాగించినప్పటికీ, టామ్ క్రూయిజ్ మాత్రం ఒక్కసారిగా కూడా డేవిడ్ బెకహాంని సినిమాలోకి తీసుకోలేదు. ఐతే ప్రస్తుతం టామ్ క్రూయిజ్ తాను కొత్తగా నటించిన 'మిషన్ ఇంపాజబుల్ - 4' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.
ఇటీవలే ఇండియాకు వచ్చిన టామ్ తన అభిమానులతో కలిసి 'మిషన్ ఇంపాజబుల్ - 4' సినిమాని ప్రత్యేకంగా వీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సినిమ కోసం గాను టామ్ క్రూయిజ్ ప్రపంచంలో ఎత్తైన బుర్జి దుబాయ్ నుండి సాహాసోపేత విన్యాసాలు కూడా చేయడం జరిగింది. ఈ సినిమాలో టామ్ క్రూయిజ్ హీరోగా నటించగా అతని సరసన హీరోయిన్‌గా పాలా పాటన్ నటించారు. ఈసినిమాలో విలన్‌గా జెరెమీ రెన్నర్ తన దైన శైలిలో నటనలో టామ్‌కి గట్టి పోటీనిచ్చారు.
ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 15న విడుదల చేశారు. ఈ సినిమాకి దర్శకత్వం బ్రాడ్ బర్డ్ వహించారు.


Click it and Unblock the Notifications











