Mission: Impossible: The Final Reckoning Teaser Trailer: మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకాన్ ట్రైలర్ రివ్యూ
హాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్కైడ్యాన్స్ మీడియా, టీజీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సూపర్ స్టార్ టామ్ క్రూజ్, క్రిస్టఫర్ మెక్వారీ నిర్మించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకానింగ్. ఈ సినిమాలో టామ్ క్రూజ్, హేలే అత్వేల్, సైమన్ పెగ్, వెనేస్సా కిర్బీ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..
మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకానింగ్ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనే విషయాన్ని మరోసారి టీజర్ ద్వారా స్పషం చేశారు. అందమైన లోకేషన్లు, అద్బుతమై టెక్నాలజీతో రూపొందిన సన్నివేశాలు ఆకట్టుకొన్నాయి. గ్రాఫిక్స్, ఊహకు అందని యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించాయి. ఈ సినిమాను ఐమాక్స్ వెర్షన్‌లో షూట్ చేయడం గమనార్హం.

టామ్ క్రూజ్ యాక్షన్ సన్నివేశాల్లో విన్యాసాలు, తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎదురయ్యే ఫైట్స్ విన్యాసాలు ఫ్యాన్స్ ఫుల్ మీల్స్‌లా ఉన్నాయి. దాంతో ఈ టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూద్దామా అనే ఫీలింగ్ మాత్రం కలిగించేలా ఉంది. గ్రాఫిక్, వీఎఫ్ఎక్స్ వర్క్ హై లెవెల్‌లో ఉంది. డెఫినెట్‌గా ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగించే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఫ్రెజర్ టాగార్ట్, ఎడిటింగ్ ఎడ్డీ హామిల్టన్, మ్యూజిక్ లార్న్ బాల్ఫే అందవించారు. ఈ సినిమాను ప్రముఖ డిస్టిబ్యూషన్ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమాను 2025 మే 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమాను పార్ట్ వన్‌గానే ప్లాన్ చేశారు. చివరి నిమిషంలో పార్ట్ 2 మార్చారు.
అయితే ఈ సినిమా టీజర్ ట్రైలర్‌లోని సన్నివేశాల విషయానికి వస్తే.. మా జీవితాలు ఎవరి యాక్షన్ వల్లో డిసైడ్ కాలేదు. మా జీవితాలు కొంత మేరకు మా ఛాయిసే. నువ్వు చేసే ప్రతీ పని ఇలాంటి ఫలితాన్ని అందించింది అనే డైలాగ్స్ ఇంటెన్స్‌గా ఉన్నాయి. చివరిగా టామ్ క్రూజ్ చెప్పే డైలాగ్.. చివరిసారిగా మీరు నన్ను నమ్మండి అని అడుగుతున్నాను అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.
మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకానింగ్ టీజర్‌ను రిలీజ్ చేస్తూ టామ్ క్రూజ్ ఎమోషనల్‌గా స్పందించారు. మా జీవితాలు మా ఛాయిస్. మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 23, 2025న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా థియేటర్లలో మనమంతా కలుసుకొందా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











