Mission: Impossible 8 హీరో టామ్ క్రూజ్ ఆస్తులు ఎన్నివేల కోట్లంటే?.. రిచెస్ట్ హీరోల్లో ఏ ప్లేస్‌లో?

భారతదేశానికి వెలుపల సినిమా అనగానే గుర్తొచ్చేది హాలీవుడ్.. ఇంగ్లీష్ చిత్రాలు అనగానే గుర్తొచ్చేది హాలీవుడ్. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం కేంద్రంగా దాదాపు 138 ఏళ్లుగా ప్రపంచ సినిమాకు కేరాఫ్‌గా నిలుస్తోంది హాలీవుడ్. డబ్బింగ్ చిత్రాల ద్వారా హాలీవుడ్ నటీనటులు భారతీయులకు కూడా సుపరిచితులే. ఎంతోమంది హాలీవుడ్ నటుల పేర్లు మనవాళ్లకి బాగా నోటెడ్. ఇలాంటి వారిలో టామ్ క్రూజ్ ఒకరు. యాక్షన్ హీరోగా, హాలీవుడ్ సూపర్‌స్టార్‌గా ఆయన వెలుగొందుతున్నారు. ఇటీవలే మిషన్ ఇంపాసిబుల్‌ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ మే 17న మిషన్ : ఇంపాసిబుల్ - ది ఫైనల్ రెకనింగ్‌తో భారతీయులను పలకరించారు టామ్. ఈ సందర్భంగా ఆయన గురించిన ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.

18 ఏళ్ల వయసులో నటన వైపు

జూలై 3, 1962న అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించారు టామ్ క్రూజ్. ఆయన పూర్తి పేరు థామస్ క్రూజ్ మాపొదర్ IV. తండ్రి ఉద్యోగరీత్యా కెనడాలో ఆయన బాల్యం గడిచింది. తరచూ బదిలీల కారణంగా నాలుగేళ్లలో 15 స్కూళ్లను మార్చాల్సి వచ్చింది. భర్త నుంచి టామ్ తల్లి విడిపోయి పిల్లలను తీసుకుని అమెరికాకు వచ్చేసింది. అనంతరం మరో పెళ్లి చేసుకుని పిల్లలను పెంచింది. క్యాథలిక్ స్కాలర్‌షిప్‌తో చదువుకున్న టామ్.. 18 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల అనుమతితో నటనను కెరీర్‌గా ఎంచుకుని న్యూయార్క్‌లో అడుగుపెట్టారు.

Tom Cruise s Net Worth here s the Mission Impossible 8 hero s Life Style income and Assets Details

మిషన్ ఇంపాసిబుల్‌తో క్రేజ్

1981లో ఎండ్‌లెస్ లవ్ సినిమా ద్వారా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన టామ్ క్రూజ్ అనతికాలంలోనే స్టార్ డమ్ సంపాదించారు. రిస్కీ బిజినెస్‌మెన్, టాప్ గన్, ది కలర్ ఆఫ్ మనీ, రెయిన్ మెన్, ది ఫర్మ్, ఫాలెన్ ఏంజెల్స్ సినిమాలతో దూసుకెళ్లాడు. ఈ దశలో 1996లో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌కు శ్రీకారం చుట్టడంతో టామ్ క్రూజ్ కెరీర్ సరికొత్త మలుపు తిరిగింది. హెలికాఫ్టర్‌లు, విమానాల నుంచి దూకడం, కొండలను బైక్‌తో ఎక్కడం వంటి రిస్కీ స్టంట్స్‌తో యాక్షన్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు టామ్. దీంతో ఆయన క్రేజ్ హాలీవుడ్ దాటి ప్రపంచం మొత్తం విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమాన గణం టామ్ సొంతం.

హాలీవుడ్‌కు ఐకాన్‌గా

దాదాపు 40 ఏళ్ల కెరీర్‌లో మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌తో పాటు నాలుగు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు టామ్ క్రూజ్. ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 12 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి. హాలీవుడ్‌కు ఐకాన్‌గా, ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుడిగా టామ్ క్రూజ్ రికార్డుల్లోకెక్కారు. తొలుత ఆయన మిమీ రోగర్స్‌ను, తర్వాత నికోల్ కిడ్‌మన్, అనంతరం కేట్ హోల్మోస్‌లను పెళ్లాడి ముగ్గురి నుంచి విడిపోయారు. 1993లో క్రూజ్ వాగ్నర్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాతగా మారి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు .

టామ్ క్రూజ్ ఆస్తుల వివరాలు

టాప్స్ చిత్రానికి 50 వేల డాలర్లను పారితోషికంగా తీసుకున్న టామ్ క్రూజ్.. మిషన్ ఇంపాసిబుల్ 2కి 100 మిలియన్ డాలర్ల పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించారు. సినిమాలు, వ్యాపారాల ద్వారా ప్రతియేటా వందల కోట్లు సంపాదిస్తున్నారు టామ్ క్రూజ్. ఆయన నికర ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.5,100 కోట్లు) పైమాటే. ఆయనకు అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో విలాసవంతమైన ఎస్టేట్స్, మ్యాన్షన్‌లు, భవంతులు ఉన్నాయి. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, తెలివిగా పెట్టుబడుల మళ్లింపులతో టామ్ క్రూజ్ ఈ స్థాయికి చేరుకున్నారు.

More from Filmibeat

Read more about: tom cruise
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X