twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా వేళ టామ్ హాంక్స్ దంపతులు రక్తదానం.. ఎందుకంటే..

    |

    ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌ కోసం వాక్సిన్‌ను కనిపెట్టే ప్రయత్నాలకు హాలీవుడ్ సినీ దంపతులు టామ్ హాంక్స్, రీటా విల్సన్‌ ముందుకొస్తున్నారు. మార్చిలో ఆస్ట్రేలియాలో సినిమా షూటింగ్ వెళ్లిన క్రమంలో వారిద్దరూ కరోనావైరస్ వారిన పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు ఆస్ట్రేలియాలోని ఓ రిస్టార్టులో క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ కరోనా నెగిటివ్ అని తేలడంతో మార్చిలో అమెరికాకు చేరుకొన్నారు. యూఎస్‌లో వారు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు.

    తాజాగా కరోనావైరస్ కోసం వ్యాక్సిన్ కనిపెట్టే సైంటిస్టులకు నైతిక బలాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనావైరస్ కోసం రక్తదానం చేసేందుకు ముందుకు రావడం విశేషం. ప్లాస్మా ద్వారా కరోనాకు చెక్ పెట్టేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో టామ్ హాంక్స్ దంపతులు రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతవారం వారిద్దరూ అమెరికాలో రక్తదాన కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారని మీడియా కథనాలు వెలువడ్డాయి.

    Tom Hanks couple offered blood to develop vaccine for coronavirus

    ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లోని బీచ్ రిసార్టులో వారు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. దాదాపు రెండు వారాలపాటు నిర్బంధంలో ఉండి కరోనావైరస్ నుంచి కోలుకొన్నారు. కరోనావైరస్ ముప్పు నుంచి కోలుకొన్న తర్వాత టామ్ హాంక్స్ దంపతులు అమెరికాకు చేరుకొన్నారు. ఆ సందర్భంగా ట్విట్టర్‌లో టామ్ హాంక్స్ స్పందిస్తూ.. అభిమానులందరికీ శుభవార్త.. కరోనావైరస్ నుంచి బయటపడి అమెరికాకు చేరుకొన్నాం. ఓ ప్రైవేట్ ప్రదేశంలో ప్రస్తుతం ఆశ్రయం తీసుకొన్నాం. సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నాం అని టామ్ హాంక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాలో తమపై ప్రేమ కురిపించిన కరోనా అనే ఎనిమిదేళ్ల కుర్రాడికి కరోనా కంపెనీ తయారు చేసి టైప్ రైటర్‌ను బహుమతిగా ఇవ్వడం మీడియాలో చర్చనీయాంశమైంది. హాలీవుడ్‌లో ఇద్రిస్ ఎల్బా, ఆండీ కెహెన్, టామ్ హాంక్స్, రిటా విల్సన్ లాంటి సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడి కోలుకొన్న విషయం తెలిసిందే.

    English summary
    Hollywood star couple Tom Hanks, Rita Wilson couple offered blood to help develop vaccine for coronavirus. variety.com reported that Tom Hanks and Wilson volunteered to donate their blood and plasma for coronavirus research.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X