twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్ట్రేలియాలో కరోనాను జయించి.. యూఎస్‌కు టామ్ హాంక్స్ దంపతులు

    |

    ప్రపంచాన్ని కరోనావైరస్ పట్టి పీడిస్తున్న సమయంలో హలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్ షాకింగ్ న్యూస్ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న షూటింగ్ సమయంలో తాను, తన భార్యకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం తేలింది. దాంతో తాము హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నామని, ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నామని ఓ ప్రకటనలో తెలిపారు.

    కరోనావైరస్ ముప్పు నుంచి కోలుకొన్న తర్వాత టామ్ హాంక్స్ దంపతులు ప్రస్తుతం అమెరికాకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అభిమానులందరికీ శుభవార్త.. కరోనావైరస్ నుంచి బయటపడి అమెరికాకు చేరుకొన్నాం. ఓ ప్రైవేట్ ప్రదేశంలో ప్రస్తుతం ఆశ్రయం తీసుకొన్నాం. సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నాం అని టామ్ హాంక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    Tom Hanks couple reached Los Angeles, pens emotional letter

    ఆస్ట్రేలియాలో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో మమల్ని చాలా జాగ్రత్తగా చూసుకొన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. వారి తీసుకొన్న జాగ్రత్తలు, ఇచ్చిన సలహాలు, గైడెన్స్ కారణంగానే మళ్లీ అమెరికాకు చేరుకొన్నాం అని టామ్ హాంక్స్ తెలిపారు. మీ దీవెనల వల్లే నేను, నాభార్య క్షేమంగా తిరిగి వచ్చాం. అందుకు నా తరఫున, నా భార్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని టామ్ హాంక్స్ వెల్లడించారు.

    ఇప్పటికే హాలీవుడ్‌లో ఇద్రిస్ ఎల్బా, ఆండీ కెహెన్, టామ్ హాంక్స్, రిటా విల్సన్ లాంటి సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.

    English summary
    Tom Hanks couple reached Los Angeles, pens emotional letter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X