twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా నుంచి బతికి బట్టకట్టగలమా అనే భయం.. టామ్ హాంక్స్

    |

    ప్రమాదకర కరోనావైరస్ బారిన పడిన ప్రముఖుల్లో హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ముందు వరుసలో ఉంటారు. ఆస్ట్రేలియా కోసం షూటింగుకు వెళ్లిన టామ్ హాంక్స్ దంపతులు కరోనావైరస్ బారిన పడ్డారు. దాంతో వారిద్దరూ స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఆస్ట్రేలియాలోనే చికిత్స పొంది నెగిటివ్ ఫలితం వచ్చిన తర్వాత అమెరికాకు చేరుకొన్నారు. ప్రస్తుతం తాను నటించిన గ్రేహౌండ్స్ అనే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన కథా రచనతోపాటు స్క్రీన్ ప్లేను అందించారు. ఈ సందర్భంగా తన కరోనావైరస్ అనుభవాలను తాజాగా హాలీవుడ్ మీడియాతో పంచుకొన్నారు.

    కరోనావైరస్ పాజిటివ్ అని నిర్దారణ పరీక్షల్లో తేలగానే కొన్ని రోజులు ఆస్ట్రేలియాలోని హస్పిటల్‌లో రిటాతో కలిసి ఉన్నాను. లాస్ ఏంజెలెస్‌కు బయలు దేరేంత వరకు అక్కడే క్వారంటైన్ జీవితాన్ని గడిపాం అని టామ్ హాంక్స్ తెలిపారు. ఒక్కసారి నాకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే కదిలిపోయాను. నాకు 63 ఏళ్లు, టైప్ 2డయాబెటీస్‌తో బాధపడుతున్నాను. నా గుండెలో స్టెంట్ ఉంది. ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి బయటపడగలనా? బతికి బట్ట కట్టగలమా అనే సందేహం తలెత్తింది అని చెప్పారు.

    Tom Hanks reveals Coronavirus experience in Australia

    నాకు, నా భార్యకు రెండు వేర్వేరు లక్షణాలు కనిపించాయి. రెండు వారాలపాటు కొంత ఇబ్బంది గురయ్యాం. నా భార్య వాసనను పసిగట్టే శక్తిని కోల్పోయింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. విపరీతమైన జ్వరంతో బాధపడ్డాం. ఒంటి నొప్పుల్లాంటి సమస్యలు విపరీతంగా బాధపెట్టాయి. 12 నిమిషాల కంటే దేని మీద కూడా ఎక్కువగా దృష్టిని పెట్టలేకపోయాం. కానీ త్వరలోనే ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడటం ఊరట లభించింది అని టామ్ హాంక్స్ తెలిపారు.

    అమెరికాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. కాకపోతే అధ్యక్షుడు ట్రంప్ ఈ సంక్షోభాన్ని బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇతర నేతలు ప్రజలకు అండగా నిలిచి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు అని తెలిపారు. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే పరిశోధనకు టామ్ హాంక్స్ దంపతులు తోడ్పాటును అందిస్తున్నారు. ఇటీవల టామ్ హాంక్స్ దంపతులు రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    English summary
    Hollywood star Tom Hanks reveals Coronavirus experience in Australia. He said they were suffered a lot in australia. He said, I'm 63, I have type 2 diabetes, I had a stent in my heart - am I a red flag case?.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X