Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్పీల్బర్గ్ కొత్త సినిమా మొదలెట్టారు..డిటేల్స్
లాస్ ఏంజిల్స్ : ప్రపంచం గర్వించదగ్గ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ మరో చిత్రం ప్రారంభించారు. న్యూయార్క్ నగరంలోని నివాసప్రాంతం డంబో(డౌన్ అండర్ ది మన్ హటన్ బిడ్జి ఓవర్ పాస్) పరిణామక్రమాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ అగ్రనటుడు టామ్ హాంక్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కోల్డ్ వార్ సమయంలో మన్ హటన్ బ్రిడ్జికి సమీపంలో ఈ ప్రాంత పరిస్దితులను వెండితెరపై చూపించబోతున్నారు.
ఇప్పటికే న్యూయార్క్ లో షూటింగ్ మొదలైన ఈ చిత్రం నవంబర్ నుంచి పోలండ్‌లో జరిపేందుకు స్పీల్బర్గ్ సన్నాహాలు చేస్తున్నారు. కోయెన్ బ్రదర్స్ స్ర్కిప్ట్ సమకూర్చిన ఈ చిత్రాన్ని అమెరికా, జర్మన్ సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. అమెరికా, సోవియట్ యూనియన్లు తమ గూఢచారులను పరస్పరం మార్చుకోవడం కేంద్రంగా ఈ సినిమా కథ నడుస్తుంది.
న్యూయార్క్, బెర్లిన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హాంక్స్‌తో పాటు మార్క్ రైలాన్స్, సెబాస్టియన్ కోచ్, అమీ ర్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2015 అక్టోబర్‌లో ఈ సినిమాని విడుదల చేయాలనేది నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఉత్తమ దర్శకునిగా నాలుగు సార్లు ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయిన స్పీల్ బర్గ్ దర్శకుడు కావటంతో చిత్రానికి అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. ‘జాస్', ‘ఇండియానా జోన్స్', ‘జురాసిక్ పార్క్' వంటి చిత్రాల ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తాజాగా ‘సెయింట్ జేమ్స్ ప్లేస్' అనే చిత్రాన్ని రూపొందిస్తూండటంతో అంతటా ఆసక్తి నెలకొని ఉంది.