»   »  బెంజ్ కారు దొంగిలించి అరెస్ట్ అయిన హాలీవుడ్ హీరో

బెంజ్ కారు దొంగిలించి అరెస్ట్ అయిన హాలీవుడ్ హీరో

Posted By: Rajababu
Subscribe to Filmibeat Telugu

'లాంగ్ డ్రైవ్ లో ఎంజాయ్ చేయాలన్న కోరికతో మెర్సిడెజ్ బెంజ్ కారును దొంగిలించాను. ఆ కారణంగా 15 ఏండ్ల వయస్సులో అరెస్ట్ అయ్యాను' హాలీవుడ్ నటుడు టామ్ హర్డీ (39) ఇటీవల మీడియాకు వెల్లడించారు. 'ఆ వయస్సులో జీవితం కొంత ప్రశాంతంగా, మరికొంత నిస్తేజంగా అనిపించేది.

tom hardy, mercedes benz, mad max: fury road

దూకుడుతనంతో ఏదో చేయాలన్న తుంటరి కోరిక వల్ల అలా కేసులో ఇరుక్కుపోయాను'అని పేర్కొన్నారు. తాను దొంగిలించిన కారులో అత్యాధునిక తుపాకీ కూడా ఉన్నదని, దాంతో తాను ప్రమాదంలో పడిపోయానని అన్నారు. తన జీవితంలో కొన్ని కీలక అంశాలను ఇటీవల ప్రముఖ దినపత్రికతో పంచుకొన్నారు. మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరి రోడ్ లాంటి చిత్రాలతో హాలీవుడ్ ప్రేక్షకులకు టామ్ హార్డీ సుపరిచితుడు. ఆయన నటించిన తాజా చిత్రం డన్ కిర్క్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నది.

English summary
Tom Hardy reveals about his past life
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu