జేమ్స్ బాండ్ మారనున్నాడా? డేనియల్ క్రెయిగ్ కు బదులుగా..
జేమ్స్ బాండ్ 007 సినిమా గురించి తెలియని వాళ్ళు ఉండరేమో .. ప్రపంచంలోనే ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జేమ్స్ బాండ్ ను ఆధారం చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి. ఇక జేమ్స్ బాండ్ సీక్వెల్స్ కూడా ఆకట్టుకున్నాయి. 1962 లో ముద్దలైన ఈ సిరీస్ లో ఎన్నో భాగాలు వచ్చాయి. ఈ మధ్య వచ్చిన జేమ్స్ బాండ్ - నో టైం టూ డై వరకు ఈ విజయపరంపర కొనసాగుతూనే ఉంది.
ఇక కరోనా కారణంగా కొత్త భాగం చిత్రీకరణ వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోగా ఉన్న డేనియల్ క్రెయిగ్ కంటే మరో హీరో బెటర్ అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. టామ్ హార్డీ జేమ్స్ బాండ్ సిరీస్ లో నటించాలని భావిస్తున్నారట అభిమానులు.

మ్యాడ్ మాక్స్ , వెనమ్ , డార్క్ నైట్ రైజెస్ , సినిమాలతో టామ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు డేనియల్ క్రెయిగ్ కు బదులు టామ్ ను హీరోగా పెట్టి జేమ్స్ బాండ్ ను కొనసాగించాలన్న అభిప్రాయాలు వెల్లువెత్తడంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. డేనియల్ క్రెయిగ్ ను తప్పించి టామ్ హార్డీ ను జేమ్స్ బాండ్ గా ప్రేక్షకులముందుకు తీసుకువస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











