ఆ స్టార్ జంట కాపురంలో చిచ్చు
హాలీవుడ్ స్టార్ జంట టామ్ క్రూజ్, క్యాటీ హాల్మస్ లు ఎంతో అన్యోన్యంగా వుంటున్నారు. వారి మూడేళ్ల పాప సూరిని చూస్తూ ఎంతో మురిసిపోతున్నారు. కానీ ఇప్పుడు వారి సంసార జీవితంలో చిచ్చు మొదలైందట. దీనికి కారణం 'విచిత' సినిమాలో టామ్ సరసన నటించిన హీరోయిన్ కామెరూన్. కొంత కాలంగా టామ్, క్యాట్ ల మధ్య ఓ విషయమై వాదనలు చోటుచేసుకుంటున్నాయట. టామ్ తనకు మరో బిడ్డ కావాలని, తన పాప సూరికి ఓ తమ్ముడో, చెల్లో వుంటే బావుంటుందని అంటున్నాడట. దీనికి క్యాట్ సానుకూలంగా స్పందించలేదట. కానీ టామ్ తొందర పెడుతున్నాడట, దీనికి కారణం ప్రస్తుతం టామ్ వయసు 47 ఏళ్లు కావడం. కానీ 30 ఏళ్ల క్యాట్ మాత్రం తొందరెందుకు అనే తరహాలో స్పందిస్తోందట.
ఇలాంటి సమయంలో ఇటీవల టామ్ కుటుంబాన్ని కలసిన టామ్ కో-స్టార్ కామెరూన్ సూరితో ఆడుకుంటూ అమాయకంగా నీకో తమ్ముడో, చెల్లో వుంటే బావుంటుంది కదా అందట. ఆ తర్వాత ఆమె చక్కా వెళ్లిపోయాక టామ్, క్యాట్ ల మధ్య ఈ విషయమై పెద్ద వాదనే చోటు చేసుకొదట. ఇదంతా గమనిస్తున్న వీరి శ్రేయోభిలాషులు ఈ గొడవ ఎంత వరకూ వెళ్తుందోనని భయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











