ఛారిటీ కోసం నగ్నంగా ఆర్ట్ పెయింట్..
లేడిగాగా తన ఆట పాటలతో యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తున్న పాప్ సింగర్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచేటటువంటి లేడిగాగా ఈసారి కూడా వార్తల్లో నిలిచారు. అదెలాగంటే మ్యూజిక్ లెజెండ్ 'టోనీ బెన్నెట్' లేడిగాగాకి చెందిన నగ్న చిత్రాన్ని బయట పెట్టడం జరిగింది. ఈ నగ్న చిత్రం ప్రత్యేకతలు ఏమిటంటే ఈ చిత్రాన్ని చేతితో రూపొందించారు.
ఈ నగ్న చిత్రాన్ని ప్రముఖ ఫోటోగ్రాఫర్ 'అన్నీ లెయిబోవిజ్' తన స్వహాస్తాలతో తీశారు. ఓరిజినల్ ఫోటోగ్రాఫ్‌లో ఎలాగైతే లేడిగాగా తన చేతిలో సిగరెట్ పట్టుకోని ఉందో.. సరిగ్గా ఈ ఆర్ట్ పెయింట్‌లో కూడా అలానే వేశారు. ఈబే ద్వారా అమ్మకానికి ఈ పెయింటింగ్‌ని పెట్టారు. మొదటగా దీని ధరను $5,000 నిర్ణయించారు.
లేడిగాగా ఈ నగ్నచిత్రాన్ని ప్రముఖ మ్యాగజైన్ 'వ్యానిటీ ఫెయిర్'కి ఫోజు ఇచ్చారు. ఆ సందర్బంలో లేడిగాగా తన ఒంటిపై ధరించిన అన్ని వస్తువలతో పాటు, ఓరిజినల్ ఇమేజిని లేడిగాగా తన సంతకంతో ఎవరైతే ఈ ఆర్ట్ పెయింటింగ్‌ని సొంతం చేసుకుంటారో వారికి అందించనున్నారు. ఈ ఆర్ట్ పెయింటింగ్ ద్వారా వచ్చిన సోమ్ముని లేడిగాగా యూత్ సపోర్ట్ ఛారిటీ 'బార్న్ దిస్ వే ఫౌండేషన్'కి అందించనున్నారు.


Click it and Unblock the Notifications











