twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు : చరిత్రలో టాప్ 10 కలెక్షన్ సినిమాలివే!

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్ : ప్రపంచం మొత్తంలో అతిపెద్ద సినీ పరిశ్రమ అంటే హాలీవుడ్ పరిశ్రమే. హాలీవుడ్ నుంచి విడుదలయ్యే సంఖ్య మాత్రమే ఎక్కువ కాదు, ఈ సినిమాల బడ్జెట్ కూడా ఆకాశాన్ని అంటే ఎత్తులో ఉంటాయి. అఫ్ కోర్స్ అందుకు తగిన మార్కెట్ ఉంది కాబట్టే వందలు, వేల కోట్ల పెట్టుబడితో సినిమాలు తీస్తున్నారు.

    ప్రతి సంవత్సరం వందలాది హాలీవుడ్ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ మార్కెట్ ఉంది. అందుకు తగిన విధంగానే ఈచిత్రాలకు ప్రచారం కల్పిస్తూ ఉంటారు. ప్రపంచంలోని అత్యధిక భాషల్లో అనువాదం అయ్యే సినిమాలు కూడా ఇవే.

    ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతాయి కాబట్టి కలెక్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. హాలీవుడ్ చరిత్రంలో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో కొన్ని చిత్రాలు మాత్రం భారీ వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచాయి. అవతార్, టైటానిక్, ది అవెంజర్స్, ట్రాన్స్ ఫార్మర్స్, హారీ పొట్టర్ సిరీస్ సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీసు వద్ద వసూళ్లు సాధించాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు, టాప్ 10లో నిలిచిన చిత్రాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం...

    అవతార్


    హాలీవుడ్లో వచ్చిన అద్భుతమైన చిత్రాల్లో అవతార్ చిత్రం ఒకటి. డిసెంబర్ 18, 2009లో విడుదలైన ఈచిత్రానికి ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. 9 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ఈచిత్రం 250 మిలియన్ డాలర్లతో నిర్మితమై, 2.782 బిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. హాలీవుడ్ చరిత్రలో ఇదే హయ్యెస్ట్ గ్రాసర్

    టైటానిక్


    జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుత చిత్రం ‘టైటానిక్'. డిసెంబర్ 19, 1997లో ఈచిత్రం విడుదలైంది. 200 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2.1 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    ది అవెంజర్స్


    మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నిర్మించిన ‘ది అవెంజర్స్' చిత్రానికి జాస్ వెడన్ దర్శకత్వం వహించారు. 220 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 1.511 బిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

    హారీ పొట్టర్ అండ్ డెత్లీ హాల్లోవ్స్ పార్ట్-2


    హారీ పొట్టర్ సిరీస్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘హారీ పొట్టర్ అండ్ డెత్లీ హాల్లోవ్స్ పార్ట్-2'. జులై 7, 2011లో విడుదలైన ఈచిత్రం 1.328 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.

    ట్రాన్స్ ఫార్మర్స్ : డార్క్ ఆఫ్ ది మూన్


    జూన్ 23, 2011లో విడుదలైన ఈచిత్రం 1.123 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి హాలీవుడ్ చరిత్రలో ఐదో స్థానం దక్కించుకుంది.

    ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ : ది రిటర్న్ ఆఫ్ ది కింగ్స్


    ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ : ది రిటర్న్ ఆఫ్ ది కింగ్స్ చిత్రం డిసెంబర్ 13, 2003లో విడుదలైంది. కేవలం 94 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మితమై 1.119 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.

    స్కైఫాల్


    జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాల్లో 23వ చిత్రం స్కైఫాల్. అక్టోబర్ 23, 2012లో విడుదలైన ఈచిత్రాన్ని 200 మిలియన్ డాలర్లతో నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1.108 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.

    ది డార్క్ నైట్ రైసెస్


    ది డార్క్ నైట్ రైసెస్ చిత్రం జూన్ 20, 2012లో విడుదలైంది. 250 మిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందిన ఈచిత్రం 1.081 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ : డెబ్ మాన్స్ చెస్ట్


    పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ : డెబ్ మాన్స్ చెస్ట్ చిత్రం జూన్ 7, 2006లో విడుదలైంది. 225 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈచిత్రం 1.066 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    టాయ్స్ స్టోరీ 3


    టాయ్స్ స్టోరీ 3 చిత్రం 200 మిలియన్ డాలర్లతో నిర్మితమై 1.063 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    English summary
    Hollywood is one of the biggest film industries in the world, which produce a large number of films every year. It produces movies in various genres like sc-fi, suspense thrillers, comedy, romantic, action, superhero and a few other kinds of the flicks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X