బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న 'టాప్‌గన్' డైరెక్టర్

68 సంవత్సరాల వయసు కలిగిన టోనీ స్కాట్ నిన్సెంట్ థామస్ బ్రిడ్జిగా పిలవబడే లాస్ ఏంజిల్స్ కంట్రీ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహాత్య చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆత్మహాత్యకు ముందు టోనీ స్కాట్ కారు టోయోటా ప్రిస్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ వీధిలో పార్క్ చేసి ఉంచాడని అమెరికా కోస్ట్ గార్డ్ నిపుణుడు జెన్నిఫర్ ఓస్‌బర్న్ తెలిపారు. ఈ కారులోనే తాను ఆత్మాహత్య చేసుకుంటునట్లు రాసి ఉంచిన సుసైడ్ నోట్ లభించిందని అన్నారు.
టోనీ స్కాట్ హాలీవుడ్‌లో టాప్ గన్, డేస్ ఆప్ థండర్, బేవరీ హిల్స్ కాప్ 2 లాంటి బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన సినిమాలకు దర్శకత్వం వహించారు. బ్రిటిష్ సంతతికి చెందిన ఈ టోనీ స్కాట్ ప్రముఖ నిర్మాత రైడ్లీ స్కాట్ బ్రదర్ కావడం విశేషం.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











