Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘టాప్ గన్ మావెరిక్’ ట్రైలర్: టామ్ క్రూయిజ్ ఒళ్లు గగుర్బొడిచే విమాన విన్యాసాలు!
హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూయిజ్ నటించిన 'టాప్ గన్' మూవీ 1986లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పట్లో కేవలం 15 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన మూవీ 356 మిలియన్ డాలర్లు రాబట్టి వసూళ్ల వర్షం కురిపించింది.
దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. 'టాప్ గన్-మావెరిక్' పేరుతో రూపొందిన ఈ మూవీ 2020 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఒళ్లు గగుర్బొడిచే సన్నివేశాలతో ట్రైలర్ ఉత్కంఠరేపుతోంది.
30 ఏళ్లకుపైగా సర్వీస్, కంబాట్ మెడల్స్, సైటేషన్స్, గడిచిన 40 ఏళ్లలో మూడు శత్రు విమానాలు కూల్చిన ఒకే ఒక్క వ్యక్తివి.. అయినా నీకు ప్రమోషన్ రాలేదు, రిటర్మెంట్ తీసుకోకుండా ఇంకా నీ బెస్ట్ ఎఫర్ట్ చూపిస్తున్నావు.... అనే డైలాగుతో ట్రైలర్ మొదైలంది.
ఈ చిత్రంలో టామ్ క్రూయిజ్ కెప్టెన్ పేటె మావెరిక్ మిచెల్గా కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది జూన్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 140 మిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనేభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
జోసెఫ్ కోసిన్స్కి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో మైల్స్ టెల్లర్, జెన్నిఫర్ కొనెల్లీ, జోన్ హామ్, గ్లెన్ పోవెల్, లెవిస్ పుల్‌మ్యాన్, ఎడ్ హారిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో టామ్ క్రూయిజ్ కూడా భాగం కావడం విశేషం.