నన్ను లైంగికంగా వేధించాడు.. శారీరకంగా కూడా.. హీరోపై నటి ఆరోపణలు
హాలీవుడ్ డైరెక్టర్ హార్వే వీన్‌స్టెయిన్ లైంగిక వేధింపుల ఘటన మరిచిపోకముందే సహచర నటుడు జెఫరీ టాంబూర్‌పై హాలీవుడ్ తార ట్రేస్ లిసెట్టే తీవ్ర ఆరోపణలు చేసింది.
Recommended Video

హాలీవుడ్ డైరెక్టర్ హార్వే వీన్‌స్టెయిన్ లైంగిక వేధింపుల ఘటన మరిచిపోకముందే సహచర నటుడు జెఫరీ టాంబూర్‌పై హాలీవుడ్ తార ట్రేస్ లిసెట్టే తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై భౌతికంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో ట్రేస్ పోస్ట్ పెట్టడం సంచలనానికి దారి తీసింది. సవివరంగా రాసిన పోస్ట్‌లో దర్శకుడిపై తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. షూటింగ్‌లో తనతో చాలా సార్లు దుష్ఫ్రవర్తనతో ఇబ్బందికి గురిచేశాడని ఆమె తెలిపింది. ఇంతకీ ఆమె రాసిన పోస్టులో ఏమున్నదంటే..

నాపై లైంగిక వేధింపులు
అమెజాన్ సిరీస్ ట్రాన్స్‌పరెంట్ సెకండ్ సీజన్ షూటింగ్‌లో పలుమార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలెగ్జాండ్రియా బిల్లింగ్స్‌తో సీన్ చేస్తుండగా, గ్యాప్‌లో నేను ఓ మూలన నిలుచున్నాను. ఎవరూ లేని సమయంలో నా వద్దకు మీద పడినాడు. ఆ సమయంలో అతడిని నియంత్రించడానికి చాలా కష్టపడ్డాను.

దారుణంగా ప్రవర్తించాడు
కుటుంబ సభ్యుల మాదిరిగా షూటింగ్ కలిసి మెలిసి ఉండే వాతావరణంలో జెఫరీ టాంబూర్ నాపై దారుణంగా వ్యవహరించాడు. వాస్తవానికి అది ఆయనకు గుణపాఠం చెప్పాల్సిన సమయం అది. ఈ వ్యవహారంపై సరైన చర్యలు తీసుకోవాల్సి ఉండేది అని ఓ నిర్మాతకు వివరించింది.

ఆరోపణలు సరికావు..
అయితే ట్రేస్ లిసెట్టే ఆరోపణలను ట్యాంబర్ తోసిపుచ్చారు. తాను అలాంటి వాడిని కాదు. నాపై ఆరోపణలు చేయడం సరికాదు. ఏదో మనసులో పెట్టుకొని చేసే నిందారోపణలు మాత్రమే అని ఓ ప్రకటనలో ట్యాంబర్ పేర్కొన్నారు.

నేను దుర్మార్గుడిని కాను
నా కెరీర్‌లో చాలా మందితో కలిసి పనిచేశాను. ఎవరూ నాపై ఇలాంటి ఆరోపణలు చేయలేదు. కాకపోతే పనిచేసేటప్పుడు చాలా ఉద్రేకంగా పనిచేస్తాను. నా అభిప్రాయాలను చాలా కఠినంగా చెబుతాను. అంత మాత్రాన నేను దుర్మార్గుడిని కాదు. ఒకవేళ నా చర్యలు ఆమెను ఇబ్బందికి గురిచేస్తే క్షమాపణలు చెబుతాను. నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా నేను ఎవరినీ మానసికంగానూ, శారీరకంగానూ గాయపరుచలేదు అని ట్యాండర్ అన్నారు.


Click it and Unblock the Notifications











