ట్రాన్స్‌ఫార్మర్స్-4 తెలుగులో ‘వినాశకార యుగం’ (ఫోటోలు)
హైదరాబాద్: హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ట్రాన్స్ ఫార్మర్స్-4'(ఏజ్ ఆఫ్ ఎక్స్ టిన్షన్). 'ట్రాన్స్ ఫార్మర్స్' సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈచిత్రం 'వినాశకార యుగం' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవల ట్రైలర్, పోస్టర్లు విడుదల చేసారు.
పోరాట దృశ్యాలు, విజువల్ ఎఫెక్ట్స్ పుష్కలంగా ఉన్న ఈ ట్రైలర్స్ ట్రాన్స్ ఫార్మర్స్ ప్రాంచైజ్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. విడుదలైన మొదటి పోస్టర్లో ఆప్టిమస్ ప్రైమ్ కత్తి పట్టుకుని తన బల ప్రదర్శన చూపిస్తే...రెండో పోస్టర్‌లో కేడ్ యేగర్స్ కూతురు టెస్సా యేగర్ కనిపిస్తుంది.
ఈ కొత్త సీక్వెల్‌లో కేడ్ యేగర్ ఆటోబోట్స్‌తో చేతులు కలిపి డిసెప్షన్స్ నుంచి ప్రపంచాన్ని ఆటో బోట్స్ ఎలా కాపాడాయి అనేది చిత్ర ఇతివృత్తం. నికోలా పెల్జ్, జాక్ రేనార్, స్టాన్లీ టుస్సీ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి మైఖేల్ బే దర్శకుడు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 27వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రాన్స్ ఫార్మర్స్ 4
హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రాన్స్ ఫార్మర్స్-4'(ఏజ్ ఆఫ్ ఎక్స్ టిన్షన్).

తెలుగులో వినాశకార యుగం
‘ట్రాన్స్ ఫార్మర్స్' సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈచిత్రం ‘వినాశకార యుగం' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ప్రేక్షకులకు నచ్చే విధంగా
పోరాట దృశ్యాలు, విజువల్ ఎఫెక్ట్స్ పుష్కలంగా ఉన్న ఈ ట్రైలర్స్ ట్రాన్స్ ఫార్మర్స్ ప్రాంచైజ్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

స్టోరీ ఏంటి?
ఈ కొత్త సీక్వెల్‌లో కేడ్ యేగర్ ఆటోబోట్స్‌తో చేతులు కలిపి డిసెప్షన్స్ నుంచి ప్రపంచాన్ని ఆటో బోట్స్ ఎలా కాపాడాయి అనేది చిత్ర ఇతివృత్తం. జూన్ 27వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











