ఎవరేమనుకుంటే నాకేంటి?? నేనింతే!!
ప్రముఖ అమెరికా మోడల్ జోర్డాన్ తన బాయ్ ఫ్రెండ్, బాక్సర్ అయిన అలెక్స్ రెయిడ్ అమ్మాయి వేషధారణలో వున్నప్పటి ఫోటోలను తన మిత్రులకు చూపించిన విషయం, అది ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలిసిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఇన్నాళ్లు మౌనం వహించిన రెయిడ్ తాజాగా తాను తనకి నచ్చినట్టు వుంటానని, దీనిపై ఇతరులుకి అంత ఆశక్తి ఎందుకని మండి పడుతున్నాడు. తాను 'ట్రై సెక్సువల్' అనీ ఏదైనా ఓ సారి ప్రయత్నించడంలో తప్పులేదని భావిస్తానని, ఇతరులు ఏమన్నా తాను పట్టించుకోనని 'ఓకే' మ్యాగ్జయిన్ కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు. తానిలా వుండటాన్ని ఎంతో ఆశ్వాదిస్తానని, ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయని, వాటిగురించి ఆందోళన చెందమని, తన గురించి కాదనీ మీడియా వారికి హితవు పలికాడు. ఇన్ని విషయాలు చెప్పిన రెయిడ్, ఇలాంటి వార్తలు క్యాప్చర్ చెయ్యకపోతే మీడియాకు పబ్బం గడవటం ఎలాగ అని మాత్రం ఆలోచించలేదనుకుంటా!!


Click it and Unblock the Notifications











