లేడీ ప్రొడ్యూసర్‌ను పెళ్లాడిన టాప్ హీరోయిన్.. ఉంగరాలు మార్చుకొని ముద్దుల్లో మునిగిన కొత్త జంట
హాలీవుడ్‌లో పాపులర్ మూవీ ట్విలైట్ (Twilight) చిత్రంలో నటించిన హీరోయిన్ క్రిస్టెన్ స్టివార్ట్ సుదీర్ఘకాలంగా డేటింగ్ చేస్తున్న లవర్, నిర్మాత డైలాన్ మేయర్‌ను వివాహం చేసుకొన్నారు. వీరిద్దరూ మహిళలు కావడంతో స్వలింగ సంపర్క వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి.. వారి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. నిరాడంబరంగా జరిగిన పెళ్లి సందర్భంగా హాజరైన కుటుంబ సభ్యులు కొత్త జంటకు ఆశీర్వాదం అందించారు. ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ట్విలైట్ సినిమాకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన డైలాన్‌తో క్రిస్టెన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య సన్నిహిత సంబంధాలు బలపడ్డాయి. దాంతో విడదీయలేనంత ప్రేమ వారి మధ్య చోటు చేసుకొన్నది. దాంతో తమ ప్రేమ వ్యవహారాన్ని, పెళ్లి ప్రపోజల్‌ను పెద్దల దృష్టికి తెచ్చారు. వారిద్దరి బంధానికి అంగీకారం తెలిపి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యుల ఆమోదం తెలపడంతో డైలాన్, క్రిస్టిన్ ఇద్దరు వివాహానికి ఏర్పాట్లు చేసుకొన్నారు. ఈస్టర్ పండుగ రోజున అంటే ఏప్రిల్ 20వ తేదీన వారిద్దరూ సీక్రెట్‌గా జరిగిన కార్యక్రమంలో ఒక్కటయ్యారు. పెళ్లికి కొద్ది రోజుల ముందే వారిద్దరూ మ్యారేజ్ కోసం లైసెన్స్ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి పొందారు. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన పనులు పూర్తి చేసుకొన్నారు. వీరి పెళ్లికి హాలీవుడ్ నటులు ఆష్లే బెన్సన్, బ్రాండన్ డేవిస్ దంపతులు హాజరయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రిస్టిన్, డైలాన్ ఇద్దరు తమ డేటింగ్‌ను 2019 నుంచి కొనసాగిస్తున్నారు. 2021 సంవత్సరంలో తమ ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నట్టు ప్రకటించారు. గత మూడు, నాలుగేళ్లుగా వారు రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. భవిష్యత్‌లో కూడా తమ బంధాన్ని ఇంతే బలంగా కొనసాగించాలని కోరుకొంటున్నామని వారు తెలిపారు.

ఇదిలా ఉండగా, నటి క్రిస్టిన్ స్టివార్డ్‌కు ఇంతకుముందే వివాహం జరిగింది. తన సహా నటుడు రాబర్ట్ పాటిన్సన్‌ను వివాహం చేసుకొన్నారు. అయితే కొన్నేళ్లు దాంపత్య జీవితం కొనసాగించిన తర్వాత మే 2013 సంవత్సరంలో వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి డైలాన్‌తో ప్రేమలో ఉన్నారు.
ఇక హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కూతురైన డైలాన్ మేయర్ కొన్ని షార్ట్ ఫిలింలో నటించి నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో XoXo అనే సినిమాను రూపొందించారు. ఇంకా కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. అయితే ట్విలైట్ సినిమా సెట్లో క్రిస్టిన్ స్టివార్డ్‌ను కలిసిన తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి డేటింగ్ చేస్తూ తాజాగా ఏప్రిల్ 20 తేదీన వివాహం చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











