ఆ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ విడుదలకు సిద్ధం అవుతోంది..!!
2009వ సంవత్సరంలో హాలీవుడ్ ఉత్తమ చిత్రంగా, అత్యధిక మహిళాదరణ పొందిన సినిమాగా పేరొందిన ట్విలైట్ సీక్వెల్ చిత్రం 'న్యూ మూన్' ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా మూడు వారాల పాటు బక్సాఫీసు వద్ద మొదటి స్థానంలో నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా ట్విలైట్ సాగా ఎక్లిప్స్ విడుదలకు సిద్ధం అవుతోంది. 2010 లో ఎక్కువ మంది చూడాలని ఆశపడుతున్న సినిమాగా ఈ ఎక్లిప్స్ ఎంపికయింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టడమే కాకుండా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న ట్విలైట్, న్యూ మూన్ సినిమాలకు సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే వున్నాయి. ఈ సినిమా కూడా గత సినిమాల్లాగే రికార్డులను తిరగరాస్తుందని నిర్మాతల ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











