స్టార్ హీరో, హీరోయిన్ల విడాకుల కేసులో ట్విస్ట్.. ఊహించని నిర్ణయంతో మరో మలుపు!
హాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు జెన్నిఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ విడాకుల వ్యవహారంలో మరో ట్విస్టు చోటుచేసుకొన్నది. గత కొద్దికాలంగా వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో కలిసి ఉండలేని స్థితిలో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. దాంతో వారిద్దరూ కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. అయితే కోర్టు విచారణ సమయంలో జెన్నిఫర్ రిక్వెస్ట్ మేరకు డైవోర్స్ గురించిన వాదనలు నిలిపివేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
జెన్నిఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ ప్రేమ కథ, దాంపత్య జీవితం సినిమా కథకు మంచి కనిపిస్తుంది. వారిద్దరూ 2000 సంవత్సరంలో డేటింగ్ ,చేశఆరు. ఆ తర్వాత వారిద్దరూ తమ రిలేషన్స్ షిప్‌కు బ్రేప్ చెప్పుకొన్నారు. అయితే 2021 సంవత్సరంలో అంటే 20 ఏళ్ల తర్వాత వారిద్దరూ మళ్లీ కలువాలని నిర్ణయించుకొన్నారు.

అయితే బెన్‌తో బ్రేక్ తర్వాత జెన్నిఫర్ బేస్ బాల్ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగ్స్‌ను వివాహం చేసుకొన్నది. అయితే మళ్లీ కలిసి జీవించాలని బెన్ ఆసక్తి చూపి చొరవ తీసుకోవడంతో అలెక్స్‌కు జెన్నీ బ్రేకప్ చెప్పింది. దాంతో వారిద్దరి బంధం మళ్లీ చిగురించింది. అలా రెండోసారి కలిసి సహజీవనం చేశారు.
అయితే కొన్నాళ్లు లివింగ్ టుగెదర్ చేసిన తర్వాత లాస్ వెగాస్‌కు జూలై 2022లో వివాహం చేసుకొన్నారు. అయితే గత రెండేళ్లుగా వారిద్దరూ మంచిగానే కలిసి జీవిస్తున్నారని అనుకొన్నారు. కానీ అనూహ్యంగా జెన్నీ బెన్ ఇద్దరూ సపరేట్ అయి వేర్వేరుగా జీవిస్తున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఊహగానాలకు తగినట్టే వారిద్దరూ కోర్టును ఆశ్రయించడంతో వారిద్దరి డైవోర్స్ వార్తలకు బలం చేకూరింది.

అయితే కోర్టు వాదనలు జరుగుతున్న నేపథ్యంలో భర్త బెన్ గురించి మాట్లాడుతూ.. తను నన్ను బాగా వేధించాడు. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత రెండోసారి చొరవ తీసుకోవడంతో అతడే నా జీవితం అనుకొన్నాను. కానీ అతడి ప్రవర్తన చూసి నేను అప్‌సెట్ అయ్యాను. అతడిపై విపరీతంగా కోపం కలిగింది అని చెప్పినట్టు హాలీవుడ్ పత్రికలు కథనాలు ప్రచురించాయి.
జెన్నీఫర్ విడాకుల విషయంలో తర్జనభర్జన పడుతున్నది. తన జీవితంలో 5 గురు పిల్లలు ఉన్నారు. ఇక బెన్ తన మొదటి భార్యతో ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తమ పిల్లల్ని ఒక కుటుంబంగా చేయాలని అనుకొన్నాం. కానీ అది కుదర్లేదు. ఆయన తీరు, మానసిక ప్రవర్తన నచ్చకపోవడంతో నేను డైవోర్స్ తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాను. అయితే కొన్నాళ్లు వేచి చూడాలనే అభిప్రాయం నాలో నెలకొన్నదనే వాదన చేసినట్టు తెలిసింది. దాంతో వీరిద్దరి మధ్య డైవోర్స్ అవుతుందా? జెన్నిఫర్ తాజా నిర్ణయం వల్ల విడాకుల మంజూరు విషయంలో ఆలస్య అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.


Click it and Unblock the Notifications











