For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ డైరెక్టర్ ఓ జంతువు.. నేలపై తోసి లైంగికదాడి.. నగ్న లీలలతో నరకం.. నటి ఉమా

By Rajababu
|
Harvey Weinstein Hits Back At Uma Thurman

హాలీవుడ్ దర్శకుడు హార్వే వీన్‌స్టెయిన్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు గుప్పుమన్నాయి. హాలీవుడ్ నటి ఉమా థుర్మాన్ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడం మళ్లీ హార్వే అకృత్యాలు మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి. ఇప్పటి వరకు హార్వేపై 80కి పైగా హాలీవుడ్ తారలు లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వారిలో ప్రముఖ హీరోయిన్లు సల్మా హయక్, గ్వేనెత్ పాల్త్రో, ఎంజెలీనా జోలీ తదితరులు ఉన్నారు. తాజాగా ఉమా టైమ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇవే..

హోటల్‌లో లైంగిక దాడి

హోటల్‌లో లైంగిక దాడి

ఓ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ గురించి చర్చించేందుకు ప్యారిస్ వెళ్లాం. అక్కడ నాపై లైంగిక దాడి చేశారు. మేము హోటల్ ఉండగా అర్ధనగ్నంగా దుస్తులు ధరించాడు. అయితే ఆ విషయాన్ని తొలుత పట్టించుకోలేదు. కానీ తనను కూడా అలాంటి దుస్తులు ధరించి తనతోపాటు బాత్రూంలోకి రమ్మన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అతడిని అనుసరించాను.

బాత్రూంలో నరకం

బాత్రూంలో నరకం

కానీ బాత్రూంలోని స్టీమ్ రూం (ఆవిరి గదిలోకి) వెళ్లగానే నరకం కనిపించింది. ఆ సమయంలో గది వేడితో నిప్పులు గక్కుతున్నది. వెంటనే ఆయనపై నేను గట్టిగా అరిచాను. తాను చేసే వికృత చర్యలతో విసిగిపోయాను. వెంటనే ఓ తోపు తోసి బయటకు పరిగెత్తాను.

జంతువులా ప్రవర్తించాడు

జంతువులా ప్రవర్తించాడు

అంతేకాదు మరోసారి లండన్‌లో కూడా హార్వే వీన్‌స్టెయిన్ మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేను నేలపైకి తోశాడు. ఆ తర్వాత నన్ను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించాడు. నగ్నంగా నా ముందు నిలబడ్డాడు. వికృత చేష్టలను నా ముందు ప్రదర్శించాడు. ఓ జంతువులా ప్రవర్తించాడు.

హార్వే లైంగిక పైశాచికత్వం

హార్వే లైంగిక పైశాచికత్వం

హార్వే అకృత్యాలు, లైంగిక వేధింపులు అంతటితో ఆగలేదు. ఓ సారి పసుపు రంగు గులాబీలు పంపి చాలా నీచంగా వ్యవహరించాడు. డైపర్ లాంటి దానిపై ఏదో రాసి పంపించాడు. మగాడిని రెచ్చగొట్టే లక్షణాలు నీలో చాలా ఉన్నాయి అని అందులో రాశాడు అని ఉమ చెప్పింది.

కెరీర్ నాశనం చేస్తానని

కెరీర్ నాశనం చేస్తానని

హర్వే అకృత్యాలకు ముగింపు పలుకాలని అనుకొన్నాను. ఒకవేళ ఇలాంటి వేధింపులు ఆపకపోతే నీన్ను బజారుకీడుస్తాను. నీ ప్రతిష్ఠను మంటగలుపుతా. నీ జీవితం నాశనమైపోతుందని బెదిరించాను అని ఉమా పేర్కొన్నది. ఆ తర్వాత నా కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది.

హార్వే శత్రువే

హార్వే శత్రువే

నాపై జరిపిన లైంగిక దాడుల నేపథ్యంలో హార్వేను ఎప్పడికీ నా శత్రువుగానే పరిగణిస్తా. అతడితో కలువాల్సి వస్తే పదిమంది అతడి చుట్టు ఉంటే కలిసేందుకు ఇష్టపడేదానిని. హార్వే మాదిరిగానే మరో దర్శకుడు క్వెంటిన్ టారాంటినో కూడా నాతో బిహేవ్ చేశాడని ఉమా థుర్మాన్ వెల్లడించారు.

క్వెంటిన్ టారాంటినో అకృత్యాలు

క్వెంటిన్ టారాంటినో అకృత్యాలు

కిల్ బిల్ సినిమా షూటింగ్ సందర్భంగా కండిషన్‌లేని ఓ పాతకారు ఇచ్చి దర్శకుడు క్వెంటినో డ్రైవ్ చేయమన్నారు. నిర్మాతలు కూడా అభ్యంతరం చెప్పలేదు. డ్రైవింగ్ సీటుకు సరిగా స్క్రూలు కూడా లేవు. రోడ్డంత గతుకులు. 40 మైళ్ల వేగంతో వెళ్లాలి కానీ తల మీద వెంట్రుకలు ఎగరకూడదని చెప్పాడు. అది కారు కాదు నా మృత్యువాహనమని అప్పుడే అర్థమైంది. చివరకు కారు కంట్రోల్ తప్పడంతో ఓ చెట్టును బలంగా ఢీకొట్టాను అని ఉమ తెలిపారు.

చంపడానికి ప్రయత్నించావని

చంపడానికి ప్రయత్నించావని

ఆ షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వల్ల నా మెడకు బలంగా దెబ్బ తగిలింది. నా మోకాళ్లకు బలంగా గాయాలయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కట్లతో వచ్చి కారు పరిస్థితి చూస్తే దారుణంగా కనిపించింది. నన్ను చంపడానికే ఆ పాత కారు ఇచ్చావని గొడవ పడ్డాను. హార్వే నాపై లైంగికదాడికి పాల్పడితే.. నీవు చంపడానికి ప్రయత్నించావు అని క్వెంటినోపై మండిపడ్డాను ఉమ పేర్కొన్నారు.

ఉమా థోర్మాన్ మానసికంగా

ఉమా థోర్మాన్ మానసికంగా

ఉమాపై హార్వే లైంగిక వేధింపులను ఆమె స్నేహితుడు హెర్మన్ వెల్లడించారు. హర్వేతో గొడవ జరిగిన తర్వాత ఉమా తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఉమా మానసిక పరిస్థితి దిగజారడంతో తానే టాక్సీలో తన ఇంటికి తీసుకెళ్లానని హెర్మన్ చెప్పారు.

ఉమా ఆరోపణలు అవాస్తవం

ఉమా ఆరోపణలు అవాస్తవం

అయితే హార్వే తరఫు న్యాయవాది బెన్ బ్రాఫ్‌మాన్ వీరి ఆరోపణలు ఖండించారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదున్నారు. అంతేకాకుండా హార్వేపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపించడమే కాకుండా, చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

English summary
Bollywood actress Uma Thurman has finally come forward and shared her traumatic experiences of working with disgraced producer, Harvey Weinstein. She accused him of forcing himself on her, several years ago, in a London hotel room.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more