Tom Cruise: అంతరిక్షంలో టామ్ క్రూజ్ సినిమా షూటింగ్.. మరో అప్డేట్ ఇచ్చిన హాలీవుడ్ నిర్మాత
నిజమైన యాక్షన్స్ సన్నివేశాలలో ఎలాంటి సాహసాలైనా చేయగలిగే అతి కొద్ది మంది హాలీవుడ్ యాక్షన్ హీరోలలో టామ్ క్రూజ్ ఒకరు. అతనికీ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ యాక్షన్ హీరోగా గుర్తింపు ఉంది. అయితే అతను ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక అద్భుతమైన సాహసంతో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఇదివరకే టామ్ క్రూజ్ ఆకాశంలో చేసిన కొన్ని విన్యాసాలు సినిమాలో చాలా హైలెట్స్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు అతను ఏకంగా అంతరిక్షంలో షూట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదే జరిగితే స్పెస్ లో షూటింగ్ చేసిన మొదటి పౌరుడిగా టామ్ క్రూజ్ చరిత్రలో నిలుస్తాడు.
గత రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన యూనివర్సల్ పిక్చర్స్ అధినేత డోన్నా లాంగ్లే ఒక ఇంటర్వ్యూలో మరొక క్లారిటీ అయితే ఇచ్చారు. స్పేస్ వాక్ చేయి మొదటి పౌరుడిగా టామ్ క్రూజ్ చరిత్రలో నిలవడం ఖాయం అని ఈ సినిమాను భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా చెప్పారు. టామ్ మమ్మల్ని అంతరిక్షంలోకి ఎప్పుడు తీసుకువెళ్తాడా అని ఎదురు చూస్తున్నాము అని ఆ సినిమాలో అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత హీరో ప్రపంచాన్ని ఎలా కాపాడాడు.. అనే స్టోరీ లైన్ ద్వారా తెరకెక్కనున్నట్లు ఆయన తెలియజేశారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ముగిశాయి అని.. త్వరలోనే ఒక ప్రత్యేకమైన రాకెట్ లాంచ్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా కూడా యూనివర్సల్ పిక్చర్స్ అధినేత తెలియజేశారు. టామ్ క్రూజ్ దర్శకుడు డగ్ లిమాన్ తో చేయబోతున్న ఈ యాక్షన్ మూవీ కోసం నాసాతో పాటు ఎలోన్ మస్క్ యొక్క స్పెన్ ఎక్స్ కంపెనీలు కలిసి వర్క్ చేయబోతున్నాయి.
ఇంతకు ముందు ఏ హాలీవుడ్ స్టూడియో కూడా అంతరిక్షంలో షూటింగ్ చేసింది లేదు. కాబట్టి ఇది ఒక అద్భుతంగా చరిత్రలో నిలవబోతుంది. దాదాపు $200 మిలియన్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. ఇక హీరో టామ్ క్రూజ్ $30 మిలియన్ నుంచి $60 మిలియన్ల మధ్య రెమ్యునరేషన్ అందుకోవచ్చట. ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది అలాగే ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయాలు ఈ ఏడాది చివరలో తెలియనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











