ఆస్కార్ విజేత యాంగ్ లి దర్శకత్వంలో నటించడానికి సిద్దమైన ఢిల్లీ యువకుడు..!
యాన్ మార్టల్ రచించినటువంటి 'లైప్ ఆఫ్ పై' నవల బుకర్ ప్రైజ్ గెలిపోందింది. ఇప్పుడు ఈ నవల ఆధారంగా ప్రముఖ ఆస్కార్ విజేత యాంగ్ లి ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా కధ లో నటించే హిరో కోసం యావత్ ప్రపంచం మొత్తం యాంగ్ లీ సోదించారు. చివరకు మన దేశ రాజధాని ఢిల్లీలో ఓ టీనేజర్ ఆయన కధకు సరిపోతాడనే ఉద్దేశ్యంతో అతడిని ఈసినిమాలో ముఖ్యమైన లీడ్ రోల్ చేయడానికి యాంగ్ లీ తీసుకున్నారు.
అతని పేరు సూరజ్ శర్మ. అతని వయసు 17సంవత్సరాలు. గతంలో కూడా అతనికి ఎటువంటి నటించిన అనుభవం లేకపోయినప్పటికి యాంగ్ లీ అతనిని ఎందుకు ఈసినిమా నటింపజేయడానికి తీసుకున్నాడో ఎవరికి అర్ధం కావడం లేదు. సూరజ్ శర్మ తల్లిదండ్రులు ఇద్దరూ మ్యాధమేటిషిన్స్. మూడు వేలమంది వచ్చినటువంటి ఈసినిమా టాలెంట్ లోసూరజ్ శర్మ తీరు నన్ను బాగా ఆకట్టుకుందని యాంగ్ లీ అన్నారు.
ఈసినిమా కధ విషయానికి వస్తే ఇరిగిపోయినటువంటి షిప్ లోతన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓపులితో ప్రయాణం చేయవలసి వస్తుంది. అటువంటి సమయంలో అతని తీరు ఎలాఉంటుందనేది సారాంశం. ఇక యాంగ్ లీ మాట్లాడుతూ ఈసినిమాకి కావాల్సింది ఒక అమాయకత్వమైన ముఖము, సూరజ్ శర్మ కిఆడిషన్స్ నిర్వహించినప్పుడు తన కళ్శతో జీవం పలికించాడు. అందుకే ఈసినిమాకి అతనిని తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇక ఈచిత్రం షూటింగ్ నుజనవరిలో ప్రారంభించనున్నామని తైవాన్ మరియు ఇండియాలో సినిమా చిత్రీకరించి డిసెంబర్ 2010లో 3డిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.


Click it and Unblock the Notifications











