twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనసు లోని కోరికను బయట పెట్టిన హీరోయిన్

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్, జూన్ 12: ఆస్ట్రేలియన్ గాయని, హీరోయిన్ హాల్లీ వాలెన్స్ ఇటీవల ఓ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ కిమ్ కర్దాషియాన్ లేదా నటి జెస్సికా బీల్ వంటి శరీరాన్ని కలిగి ఉండాలని తన మనసు లోని కోరికను వ్యక్తం చేసింది. ఇక వివరాల్లోకి వెళితే జెస్సికా బీల్ శరీరం చూసేందుకు చాలా హార్డ్‌గా కనిపిస్తుంది. ఆమె కళ ఒక పని, గొప్ప కండరాల స్థాయిని కలిగింది. కిమ్ కర్దాషియాన్ శరీరం అంటే కూడా నాకు చాలా ఇష్టం.

    మగవారు ఎవరైనా ఆడవారిని చూసినప్పుడు ఎలాగైతే ఉండాలని అనుకుంటారో అలాంటి అద్బుతమైన శరీరం కిమ్ కర్దాషియాన్ సొంతం చేసుకుందని కొనియాడింది. ఆస్టేలియాలో సింగర్‌గా టివి షో నైబర్స్, హీరోయిన్‌గా తాను రూపొందించిన ఆల్బమ్ ఫూట్ ప్రింట్స్ ద్వారా హాల్లీ వాలెన్స్ తన సత్తాని చాటింది. యోగా అనేది మనసుని ప్రశాంతంగా ఉండడంలో ఎంతగానో సహాయ పడుతుందని చెప్పింది.

    బుద్దిజాన్ని కూడా ఫాలో అవుతానని చెప్పింది. నా ట్రైనర్ జేమ్స్ చాలా యదార్ధంగా నా శరీరాన్ని ఉత్తమమైనదిగా చేయడానికి తన వంతు సహాయం చేస్తాడని తెలిపింది. ఇక జెస్సికా బీల్, గాయకుడు జస్టిన్ టింబర్లేక్ ఇద్దరూ ఆగస్టులో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నప్పటికీ వీరికి సరైన వెడ్డింగ్ లోకేషన్ మాత్రం ఇంకా దొరకలేదు. వీరికి పెళ్లికి వచ్చే గెస్టులకు ఆతిథ్యం ఇచ్చేందుకు గాను సరైన పెళ్లి స్దలం ఎక్కడైతే బాగుంటుందో నిర్ణయించుకోలేదు. ఐతే ఓ ప్రముఖ వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం కాలిఫోర్నియా ఐతే బాగుంటుందని అనుకున్నట్లు సమాచారం.

    సింగర్‌గా ఉన్న రోజుల్లో తన కోస్టార్ హీరో అయిన జస్టిన్ టింబర్‌లేక్‌తో కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ఏవో కొన్నిమనస్పర్దలు రావడంతో ఇద్దరూ ఈ సంవత్సరం మొదట్లో విడిపోడం తిరిగి మరలా కెనాడాలోని టోరెంటోలో ఉన్న ఎల్లాస్ కాఫీ షాప్‌లో ఇద్దరూ కలసి కాఫీ త్రాగుతూ రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు.

    English summary
    Australian singer-actress Holly Valance has expressed a desire to have a body like socialite Kim Kardashian or actress Jessica Biel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X