అబ్బాయిలతో కలసి తిరిగినా సింగిల్‌గా ఉంటేనే ఇష్టం
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ వానిసా హుడ్జెన్స్ తను అబ్బాయిలతో ఎంత ఎంజాయ్ చేసినా సింగిల్‌గా ఉండడానికి మాత్రమే ఇష్టపడతానని అన్నారు. 22 సంవత్సరాల వయుసున్నటువంటి ఈ అమ్మడు ఇటీవల 'ఈ ఆన్‌లైన్' అనే వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని తెలిపింది. అందంగా ఉన్న అబ్బాయిలతో వెల్లడం నాకు చాలా ఇష్టం. అదే విధంగా నేను ఎల్లప్పుడూ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతానని అన్నారు. ఇలా ఉండడానికి కారణం సింగిల్‌గా ఉన్నప్పుడు నాకు నచ్చినివి చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
నాకు తెలిసినంత వరకు ప్రతి మనిషి తనని తాను ప్రేమించుకోవాలి. ఇలా చేస్తే తప్పుకుండా ఆ మనిషి చాలా సంతోషంగా ఉంటాడు. ఇది మాత్రమే కాకుండా తన శరీరాన్ని కూడా ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు జిమ్‌కి వెళతానని సెలవిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో వానిసా హుడ్జెన్స్ సాయంత్రం వేళ జిమ్‌కి వెళుతున్నపోటోనే. ఈ ఫోటోలో వానిసా హుడ్జెన్స్ ఒక చేతిలో మొబైల్ ఫోన్, మరోక చేతిలో శాన్ పెలిగ్రినో పట్టుకోని జిమ్‌కి వెళుతుంది.


Click it and Unblock the Notifications











