ఆమె అందం చూసి టెమ్ట్ అయిన పందులు... కసిగా కొరికేశాయి (వీడియో)
వెనిజులాకు చెందిన ఫిట్‌నెస్ మోడల్ మిచెల్లె లెవిన్‌కు బహమాస్ పర్యటనలో ఊహించని అనుభవం ఎదురైంది. బికినీలో అందాలు ఆరబోస్తున్న ఆమెను చూసి అక్కడ స్వైర విహారం చేస్తున్న పందులు కూడా టెమ్ట్ అయ్యాయి. సెక్సీగా ఉన్న ఆమె పిరుదులు వాటిలో ఎలాంటి భావనలు రేపాయో ఏమో.. కొరుక్కుతినాలని చూశాయి.
బహమాస్ సమీపంలోని పిగ్ ఐలాండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. పందులతో నిండిన ఆ దీవిని చూసేందుకు టూరిస్టులు పోటీపడుతున్నారు. వాటితో కలిసి ఫోటోలు దిగితూ, సముద్రంలో ఈతకొడుతూ సందడి చేస్తున్నారు. మిచెల్లె లెవిన్ కూడా ఆ ప్రాంతంలో పర్యటించడానికి వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది.

మిచెల్లె లెవిన్ పిరుదులు కొరికేసిన పంది
మిచెల్లె లెవిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పందులు తనపై దాడి చేసిన వీడియో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఆమె అందం చూసి పందులు కూడా ఆగలేకపోయాయి అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
గాయాన్ని ప్రదర్శిస్తూ...
బహమాస్ ఐలాండ్‌లో పంది దాడి చేయడంతో మిచెల్లె లెవిన్ అందమైన పిరుదలపై పెద్ద మచ్చ ఏర్పడింది. ఈ గాయాన్ని ప్రదర్శిస్తూ ఆమె మరో వీడియో షేర్ చేశారు. ఆ గాయం త్వరగా తగ్గిపోయి మళ్లీ సెక్సీగా కనిపించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పందులతో ఫోటో షూట్ కోసం వెళితే...
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 13.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న మిచెల్లె లెవిన్.... ఈ పిగ్ ఐలాండ్‌కు పందులతో కలిసి ఫోటో షూట్ చేసేందుకు వెళ్లారు. పందులు ఆమె అందాల్ని చూసి టెమ్ట్ అవుతాయని బహుషా ఆమె కూడా ఊహించి ఉండరు.
ఇక పందుల జోలికి వెళ్లదట
యూఎస్ఏ టుడేతో మిచెల్లో భర్త జిమ్మీ మాట్లాడుతూ...‘గాయం పెద్దగా ఏమీ కాలేదు, ఆ పాంతంలో చర్మం కమిలిపోయినట్ల అయింది. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇకపై పందులతో ఆటలు ఆడబోము' అని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











