పబ్లిగ్గా హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ మీద చెయ్యేసిన డైరెక్టర్... అంతా షాక్!
Recommended Video

హాలీవుడ్ నటి డకోటా జాన్సన్ విషయంలో జరిగిన ఓ సంఘటన ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆమె నటించిన సస్పీరియా మూవీ ప్రమోషన్లో భాగంగా టీంతో కలిసి ఇటీవల వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లుకా హీరోయిన్ డకోటా జాన్సన్ ప్రైవేట్ పార్ట్స్ మీద చేయి వేసినట్లు ఉన్న ఫోటోస్ వివాదానికి దారి తీశాయి. అయితే అతడు తప్పుడు ఉద్దేశ్యంతో చేయి వేయలేదని, ఆమె డ్రెస్సు జారి పోతుంటే తన హ్యాండ్ అడ్డు పెట్టాడని, ఆమె చాతీని టచ్ చేయలేదని అంటున్నారు.

డ్రెస్సు జారిపోతుంటే...
ఈ రెడ్ కార్పెట్ ఈవెంటుకు డకోటా... స్లీవ్ లెస్ లేస్ డ్రెస్ ధరించి హాజరయ్యారు. అయితే ఆమె డెస్సు జారిపోయే విధంగా ఉండటంతో ఆ దృశ్యాలు ఫోటోగ్రాఫర్లకు చిక్కుండా అతడు చేయి అడ్డం పెట్టినట్లు కొన్ని అంతర్జాతీయ మేగజైన్స్ పేర్కొన్నారు.

డకోటా లైట్ తీసుకుందా?
అయితే అతడు చేసిన పని తప్పుడు పని కాక పోవడం, తనను టచ్ చేయకుండా కేవలం చేయి అడ్డు పెట్టడంతో డకోటా జాన్సన్ కూడా పెద్దగా ఫీలవ్వలేదని, పైగా తనను ఫోటోగ్రాఫర్ల నుండి కాపాడారని ఆమె భావించి లైట్ తీసుకున్నట్లు ఫోటోస్ చూస్తే స్పష్టమవుతోంది.

పబ్లిసిటీ స్టంటా?
అయితే అతడు చేయి అడ్డం పెట్టిన సమయంలో డకోటా జాన్సన్ ఫేస్ ఫీలింగ్ చూసిన చాలా మంది ఇది ముందుగా ప్లాన్ చేసి... మీడియాలో హైలెట్ అయ్యేందుకు, తమ సినిమాకు మరింత పబ్లిసిటీ పెంచేందుకే ఇలా చేశారనే వాదన సైతం వినిపిస్తోంది.

సస్పీరియా
‘సస్పీరియా' చిత్రాన్ని సూపర్ నేచురల్ హారర్ చిత్రంగా తెరక్కించారు. 1977లో వచ్చిన ఇటాలియన్ మూవీని అదే పేరుతో హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











