twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎఫ్ 2’ కో బ్రదర్స్ వెంకటేష్, వరుణ్ తేజ్ హాలీవుడ్ సినిమా కోసం...

    |

    Recommended Video

    Venkatesh And Varun Lent Their Voices For Aladdin Movie || Filmibeat Telugu

    'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' మూవీలో కోబ్రదర్స్‌గా నటించిన విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేక్షకులను తమ కామెడీ టైమింగుతో తెగ నవ్వించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. త్వరలోనే వీరు ఎఫ్-2 మూవీ సీక్వెల్‌లో మళ్లీ కలిసి నటించబోతున్నారు.

    అయితే అంతకంటే ముందే మరో ప్రాజెక్ట్ కోసం వెంకటేష్-వరుణ్ తేజ్ జట్టుకట్టారు. అది కూడా ఓ హాలీవుడ్ సినిమా కోసం. తెలుగులో అనువాదం కాబోతున్న ఈ చిత్రానికి వీరు కలిసి డబ్బింగ్ చెప్పారు. 'అలాడిన్' అనే అమెరికన్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ కోసం వీరు తమ వాయిస్ అందించారు.

    అలాడిన్

    అలాడిన్

    ‘అలాడిన్' చిత్రానికి గై రిట్చీ దర్శకత్వం వహించారు. 1992లో వచ్చిన అలాడిన్ అనే యానిమేటెడ్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చితంలో కీలకంగా ఉండే జీనీ, అలాడిన్ పాత్రలకు వీరు డబ్బింగ్ చెప్పారు. జీనీ అనే భూతం పాత్రకు వెంకటేష్, అలాడిన్ పాత్రకు వరుణ్ తేజ్ వాయిస్ అందించారు.

    వెంకీ, వరున్ వాయిస్‌తో ఆకట్టుకుంటున్న ట్రైలర్

    వెంకీ, వరుణ్ తేజ్ వాయిస్‌తో కూడిన ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ‘‘మీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. అది అలాడిన్, రా కుమారి, ఇంకా అద్భుత దీపం''... అంటూ వెంకీ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. డిస్నీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 24న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    వెంకటేష్, వరుణ్ తేజ్ బిజీ బిజీ

    వెంకటేష్, వరుణ్ తేజ్ బిజీ బిజీ

    ఎఫ్-2 తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం వెంకీ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి' అనే చిత్రం చేస్తున్నాడు. జిగర్తాండ చిత్రానికి ఇది రీమేక్. దీంతో పాటు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో సాగే చిత్రానికి కమిట్ అయ్యాడు.

    త్వరలో ఎఫ్ 2 సీక్వెల్

    త్వరలో ఎఫ్ 2 సీక్వెల్

    వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 2' చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజయాన్ని నమోదు చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాకు సిద్ధం అవుతున్నారు. దీని తర్వాత ఆయన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో ఈ ఇద్దరు హీరోలతో పాటు మరో స్టార్ కూడా యాడ్ అవుతారని, ‘ఎఫ్ 3' టైటిల్‌తో ఈ చిత్రం ఉంటుందని టాక్.

    English summary
    Victory Venkatesh and Varun Tej have lent their voices for Telugu dubbed version of Aladdin, directed by Guy Ritchie and produced by Walt Disney Pictures. It is a remake of 1992 animated film, Aladdin. The two important roles Genie and Aladdin respectively. Aladdin is gearing up the big release on May 24.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X