బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎందుకు తీసివేయాల్సి వచ్చిందో దానికి కారణం అదే
మాజీ స్పైస్ గర్ల్ విక్టోరియా బెకహాం ఇటీవల ది మిర్రర్ అనే పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్యూలో తన శరీరం నుండి డిడి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ నితీసివేసిట్టు వివరించారు. విక్టోరియా బెకహాం తన శరీరంలో డిడి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకున్న సమయంలో ప్రముఖ బ్రిటిష్ వోగ్ పత్రిక ఆమెను విమర్శించిన సంగతి తెలిసిందే. ఆసమయంలో విక్టోరియా బెకహాం డిజైనర్ కూడా దానికి అంగీకరించక పోవడంతో మరలా ఆపరేషన్ చేయించుకోని వాటిని తీసివేయడం జరిగిందని అన్నారు.
ఈసందర్బంలో విక్టోరియా బెకహాం తన భర్త డేవిడ్ బెకహాంతో తన పెళ్శి నాటి సంగతులను కూడా నెమరవేసుకున్నారు. నేను ఎప్పుడూ చాలా పాజిటివ్ గాఆలోచించేదానిని అన్నారు. అది మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఏమైనా ఆలోచించాల్సిన పరిస్దితి వస్తే నాముఖములోకి చూసుకోని ఆలోచించేదానిని అన్నారు. ఆసమయంలో నవ్వుతూ ఎలాంటి నిర్ణయాలు అయినా ఇట్టే తీసుకోవచ్చని సరదాగా అన్నారు. ఇలా తను అనుభవాలను పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











