ముగింపు రోజు ఇచ్చిన ప్రదర్శన ఫ్యామిలీకి అంకితం: విక్టోరియా
లండన్: సింగర్ - ఫ్యాషన్ డిజైనర్ విక్టోరియా బెకహాం లండన్‌లో జరిగిన ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో ఇచ్చిన ఫెర్పామెన్స్‌ని తన కుటుంబానికి అంకితమిచ్చింది. 38 సంవత్సరాల వయసు కలిగిన విక్టోరియా బెకహాం ప్రముఖ పుట్ బాలర్ డేవిడ్ బెకహాం భార్య. అంతేకాదండోయ్ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారి పేర్లు బ్రూక్లెన్(13), రోమియో(9), క్రజ్(7), 13 నెలలు వయసు కలిగిన కూతరు హార్పర్.
లండన్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో స్పైస్ గర్ల్స్ తో కలిసి స్టేజి ఫెర్పామెన్స్ ఇవ్వడం అనేది నిజంగా అధ్బుతం. ఆ రాత్రి ప్రతి నిమిషాన్ని తాను ఎంతగానో ఎంజాయ్ చేశానని విక్టోరియా బెకహాం అన్నారు. ఆడియన్స్‌లో కూర్చోని నా ఫెర్పామెన్స్‌ని చూస్తున్న నా భర్త మరియు పిల్లలకు ఆ ప్రదర్శన అంకితం అని చెప్పింది. ఒలింపిక్స్ ముగింపు రోజు వాతావరణం అధ్బుతం అంటూ కొనియాడింది. స్పైస్ గర్ల్స్‌లో ఒకరైన విక్టోరియా బెకహాం 1994 తర్వాత లండన్ ఒలింపిక్స్ లో తన ఫెర్పామెన్స్ ఇచ్చింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











