ఆయన స్టయిలంటే చచ్చేంత ఇష్టం: డిజైనర్
సింగర్ నుండి ఫ్యాషన్ డిజైనర్ ప్రోపెషన్‌కు చేరుకున్న విక్టోరియా బెకహాం నటుడు రస్సెల్ బ్రాండ్‌కు మంచి డ్రస్సింగ్ సెన్సు ఉందని మెచ్చుకున్నారు. రస్సెల్ బ్రాండ్ ధరించే నల్ల జీన్స్ అతని శరీరానికి పక్కాగా సరిపోతుందని అన్నారు. ఇంకా చెప్పాలంటే రస్సెల్ బ్రాండ్‌కు ఉన్న అడవి జుట్టు అతనికి డ్రస్సు సెన్స్‌కి మరింత అందాన్ని తెస్తుందన్నారు.
37 సంవత్సరాలు వయసు కలిగిన విక్టోరియా బెకహామ్.. సాకర్ ఆటగాడు డేవిడ్ బెకహాం భార్యగా అందరికి సుపరిచితురాలు. అంతేకాకుండా నలుగురి పిల్లలకు తల్లైన విక్టోరియా బెకహాం చూడడానికి అస్సలు అలా కనిపించరు. ఓ ఫ్యాషన్ డిజైనర్‌గా తాను రూపొందించిన మగ వారి దుస్తులను ప్రమోట్ చేసేందుకు గాను రస్సెల్ బ్రాండ్ సరిగ్గా సరిపోతారని అన్నా రు.
బ్రాండ్ ప్రత్యేక ఫ్యాషన్ డ్రస్ సెన్సుని తాను ఎంతో ఇష్టపడతానని.. సూటిగా చెప్పకపోయినా బ్రాండ్ పలుకు బడిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. విక్టోరియా బెకహాం ఇటీవలే ముగ్గురు మగ బిడ్డల తర్వాత హార్పర్ సెవెన్ అనే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











