twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖరీదైన బ్రా ఇదే: విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షోలో మతిపోగొట్టిన హాట్ లేడీస్!

    |

    ఫ్యాషన్ షోలలోకెల్లా లింగరీ ఫ్యాషన్ షోలు ఎంత హాట్ హాట్ ఎట్మాస్మియర్‌తో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ప్రపంచ ప్రఖ్యాత, ఖరీదైన లింగరీ కలెక్షన్ రూపొందించే 'విక్టోరియాస్ సీక్రెట్' బ్రాండ్ ఫ్యాషన్‌షోలు చూపరుల మతి పొగొడుతుంటాయి.

    2018 సంవత్సరానికి సంబంధించిన 'విక్టోరియాస్ సీక్రెట్' ఫ్యాషన్ షో ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గ్రాండ్‌గా జరిగింది. హాలీవుడ్ సూపర్ మోడల్స్ కెండాల్ జెన్నర్, అడ్రియానా లిమా, ఎల్సా హోస్క్ లాంటి వరల్డ్ ఫేమస్ లేడీస్ విక్టోరియాస్ సీక్రెట్ న్యూ లింగరీ కలెక్షన్ ధరించి హాట్ హాట్‌గా మెరిసిపోయారు.

    1 మిలియన్ ఖరీదు చేసే బ్రా

    ఈ ఫ్యాషన్ షోలో ప్రముఖ మోడల్ ఎల్సా హోస్క్ 1 మిలియన్ డాలర్ ఖరీదు చేసే ఫాంటసీ బ్రా ధరించే అవకాశం దక్కించుకుంది. దీన్ని 2100 వజ్రాలతో రూపొందించారు. దీని ఖరీదు రూ. 7 కోట్ల పైనే ఉంటుంది.

    మతి పొగొట్టిన కెండాల్ జెన్నర్

    ఈ ఫ్యాషన్ షోలో హాలీవుడ్ బ్యూటీ కెండాల్ జెన్నర్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ లింగరీలో అభిమానుల మతి పోగొట్టింంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోస్ వైరల్ అయ్యాయి.

    అడ్రియానా లిమా

    ప్రముఖ మోడల్ అడ్రియానా తనదైన స్టైల్ స్టేట్మెంటుతో అభిమానులను అబ్బుర పరిచింది. ఆమె కోసం డిజైన్ చేసిన స్పెషల్ లింగరీలో చూపరులను మంత్రముగ్దులను చేసింది.

    అందాలు చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదు

    ఈ ఫ్యాషన్ షోలో పదుల కొద్దీ మోడల్స్ వివిధ డిజైన్లలో రూపొందించిన విక్టోరియాస్ సీక్రెట్ లింగరీ కలెక్షన్ ధరించి క్యాట్ వాక్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు అనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తం అయ్యాయి.

    English summary
    Kendall Jenner, Adriana Lima, Elsa Hosk and more show off in lingerie at Victoria's Secret Fashion Show 2018. The Victoria's Secret Fashion Show is an annual show sponsored by and featuring Victoria's Secret, a brand of lingerie and sleepwear. Victoria's Secret uses the show to promote and market its goods in high-profile settings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X