రికార్డ్ : 109 దేశాల్లో విడుదల...గేమ్ ల్లో 'బాహుబలి' (వీడియో)
లాస్ ఏంజిల్స్: వీడియో గేమ్ లు తెలియని పిల్లలు, పెద్దలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ గేమ్ లకు చిన్నపిల్లలైనా.. పెద్దవారైనా.. బానిసలు అవ్వాల్సిందే అనే రీతిలో వీటిని రూపొందిస్తున్నారు. సినిమా తరహాలో వీటి నిర్మాణం, రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి గేమ్ ఒకటు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఏ వీడియోగేమ్ పేరు వినబడితే చాలు..జనాలు వాటికి ఇట్టే అతుక్కుపోతారో ఆ గేమే ఇది. పాలిష్ వీడియో గేమ్ విచర్ సిరీస్‌లో మూడో వెర్షన్ ది విచర్ 3- వైల్డ్ హంట్. గత మే నెలలో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాల్లో విడుదల చేశారు.

విడుదలైన రెండు నెలల్లోనే ఈ గేమ్ సీడీలు దాదాపు 40లక్షలకు పైగా అమ్ముడయ్యాయి రికార్డులు క్రియేట్ చేస్తోంది. మన దేశంలోనూ చెప్పుకోదగిన రీతిలో ఈ అమ్మకాలు ఉండటం విశేషం. ఇక దీన్ని సినిమావారు గేమ్ ల్లో బాహుబలి అంటున్నారు. వారు అలా ఎందుకు అంటున్నారో ఈ క్రింద వీడియో చూసి చెప్పండి.
ఇక విచర్ మొదటి రెండు సిరీస్‌లను 2007, 2011లలో విడుదల చేశారు. అవి కూడా చాలా పేరొందాయి. ఇప్పుడు ఈ మూడో సిరీస్ ప్రపంచ దేశాల్లో తన గుర్తింపును చాటుకుంది.
పాలిష్ వీడియో గేమ్ డెవలపర్ పావెల్ మికవ్‌స్కీ దీనిని రూపొందించారు. అంతేకాదండోయ్ గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం ఈ పేరును ప్రస్తావించడం విశేషం.


Click it and Unblock the Notifications











