twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్‌కి మన కథ...హ్యాపీసే కదా

    By Srikanya
    |

    హైదరాబాద్ : హాలీవుడ్ నుంచి కథలు తెచ్చుకుని ఇక్కడ వంటకం చేయటం మనవాళ్లు అలవాటు. అందుకే ఏదన్నా మన కథ హాలీవుడ్ కు వెళ్తోందంటే ఆ ఆనందమే వేరు. తాజాగా అలాంటి అరుదైన అవకాశాన్ని విద్యాబాలన్‌ ప్రధాన పోషించిన చిత్రం 'కహానీ' పొందుతోంది. యశ్‌రాజ్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు హాలీవుడ్‌లో 'డైటీ' పేరుతో రీమేక్‌ చేయబోతుంది యశ్‌రాజ్‌ సంస్థ. నీల్స్‌ ఆర్డెన్‌ ఓప్లెవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ప్రముఖ హాలీవుడ్‌ రచయితలు జోస్‌ రివేరా, రిచర్డ్‌ రెగన్‌లు సుజయ్‌ ఘోష్‌ కథను హాలీవుడ్‌ ప్రేక్షకులకు తగ్గట్టు తీర్చిదిద్దేపనిలో ఉన్నారు.

    విద్యాబాలన్‌ ప్రధాన పాత్ర పోషించిన 'కహాని' చిత్రం బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, కమర్షియల్‌గానూ విజయం సాధించింది. . సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను వెతుక్కునే గర్భవతి పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఆ తరువాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో నటించగా 'అనామిక' పేరుతో తెలుగు, తమిళ భాషల్లోనూ రీమేక్‌ అయ్యింది. తాజాగా హాలీవుడ్‌లోనూ ఈ సినిమా 'డైటీ' పేరుతో రీమేక్‌ కాబోతోంది.

    Vidyabalan's Kahani goes to Hollywood

    ''ఈ కథను పాశ్చాత్య ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీర్చిదిద్దడంలో ఈ ఇద్దరు రచయితలు సిద్ధహస్తులు. నీల్స్‌ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ తెరపై ఎలా చూపిస్తారనే ఆసక్తితో ఉన్నాను'' అని చెప్పారు కహానీ దర్శకుడు సుజయ్‌ ఘోష్‌. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కోల్‌కతాలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది.

    అందుకు సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. హాలీవుడ్‌లోనూ యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ సంస్థ నిర్మిస్తుండగా 'ది గర్ల్‌ విత్‌ ది డ్రాగన్‌ టాటూ' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న హాలీవుడ్‌ డైరెక్టర్‌ నీల్స్‌ ఆర్డెన్‌ ఒప్లెవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జోస్‌ రివేరా, రిచర్డ్‌ రీగన్‌ రచన చేస్తున్నారు. ఓ అమెరికన్‌ మహిళ తన తప్పిపోయిన భర్తను వెతకడం కోసం కలకత్తాకు రావడమనే నేపథ్యంతో కథ ఉండబోతోంది. 'కహానీ' సినిమా హాలీవుడ్‌లో రీమేక్‌ అవుతుండటం పట్ల యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.

    English summary
    Bollywood actress Vidya Balan’s super hit film ‘Kahaani’ is going to Hollywood soon. As per our sources it will be re-made in English as ‘Deity’ and Niels Arden Oplev is the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X