For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాలీవుడ్ మూవీ కోసం విజయ్ దేవరకొండ: సరికొత్త అవతారం ఎత్తిన ‘లైగర్’ హీరో

  |

  హాలీవుడ్‌లో రూపొందే చిత్రాలకు అన్ని దేశాల్లోనూ భారీ స్థాయిలో స్పందన వస్తుంటుంది. అందులో మన దేశం కూడా ఒకటి. అక్కడ రూపొందిన ఎన్నో చిత్రాలు మన దగ్గర ఊహించని విధంగా ప్రేక్షక ఆదరణను అందుకుని వసూళ్ల వర్షం కురిపించుకున్నాయి. అందుకే ఇంగ్లీష్‌లో ఎలాంటి సినిమా తెరకెక్కినా.. దాన్ని ఇండియాలోని చాలా భాషల్లోకి డబ్బింగ్ చేసి మరీ విడుదల చేస్తుంటారు. తద్వారా ఇక్కడి ప్రేక్షకులకు ఆయా చిత్రాలను చేరువ చేయడంతో పాటు కోట్ల రూపాయలను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ పద్దతి చాలా కాలంగా కనిపిస్తూనే ఉంది.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  హాలీవుడ్ తెరకెక్కే చిత్రాల్లో అడ్వెంచరస్ మూవీలకు ఇండియాలో మరింత ఎక్కువగా స్పందన వస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు స్టార్ హీరోల చిత్రాలతో పోటీ పడి మరీ కాసులు కొల్లగొట్టుకున్నాయి. ఇందులో భాగంగానే జంతువులకు సంబంధించిన ఫ్రాంచేజీలు సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. వాటిలో 'కింగ్ కాంగ్', 'గాడ్జిల్లా' నుంచి వచ్చిన సిరీస్‌లు ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే వీటికి కొనసాగింపుగా ఎన్నో సినిమాలు రూపొందాయి. ఈ క్రమంలోనే ఈ రెండింటినీ కలుపుతూ 'గాడ్జిల్లా vs కాంగ్' అనే పేరుతో ఓ భారీ సినిమాను రూపొందించారు.

  Vijay Devarakonda Voice Over for Godzilla vs. Kong in Amazon Prime

  ఆడమ్ వింగార్డ్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ తీసిన చిత్రమే 'గాడ్జిల్లా vs కాంగ్'. దీన్ని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీకి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది కలెక్షన్ల సునామీ సృష్టించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. లాక్‌డౌన్ తర్వాత వచ్చిన ఈ మూవీ తెలుగు చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో వేచి చూశారు. ఈ నేపథ్యంలో దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

  Bheemla Nayak సెట్స్‌లో గన్‌తో పవన్ హల్‌‌చల్: రాయల్‌గా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ.. వీడియో వైరల్

  ఇక, థియేటర్లలోకి వచ్చిన సమయంలో 'గాడ్జిల్లా vs కాంగ్' చిత్రానికి డబ్బింగ్ ఆర్టిస్టులే వాయిస్ ఓవర్ అందించారు. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం ఆయా భాషలకు సంబంధించిన హీరోలతో డబ్బింగ్ చెప్పించారు. ఇందులో భాగంగానే తెలుగులో ఈ మూవీకి రౌడీ గాయ్ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన అతడు.. ఆ వీడియోను కూడా విడుదల చేశాడు. అంతేకాదు, 'రెండు లెజెండరీ మాన్‌స్టర్ల మధ్య జరిగే వార్‌కు ఈ భయంకరమైన అబ్బాయి ఇంట్రడక్షన్ ఇచ్చాడు' అని తెలుపుతూ ట్వీట్ కూడా చేశాడు.

  ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో అతడు ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు చాలా రోజుల పాటు ఈ క్రీడలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే, ఇందులో ఈ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Godzilla vs. Kong: Directed by Adam Wingard. With Alexander Skarsgård, Millie Bobby Brown, Rebecca Hall, Brian Tyree Henry. This Movie Streaming in Amazon Prime. Vijay Devarakonda Gave Voice Over for Telugu Version.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X